ఆ టైమ్‌లో విజయ్ తో చేయాల్సిన సినిమా వేరే!
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక్కోసారి అది హీరోహీరోయిన్ కాంబినేషన్ అయితే మరోసారి హీరో డైరెక్టర్ కలయిక, ఇంకొన్ని సార్లు హీరో ప్రొడ్యూసర్ కాంబినేషన్.;
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక్కోసారి అది హీరోహీరోయిన్ కాంబినేషన్ అయితే మరోసారి హీరో డైరెక్టర్ కలయిక, ఇంకొన్ని సార్లు హీరో ప్రొడ్యూసర్ కాంబినేషన్. ఇలా కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ క్రేజీగానే ఉంటాయి. కోలీవుడ్ లో కూడా అలాంటి కాంబినేషన్లు చాలానే ఉండగా అందులో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబో కూడా ఒకటి.
క్రేజీ కాంబినేషన్‌గా విజయ్- మురుగదాస్ కాంబో
వీరిద్దరూ కలిసి కత్తి, తుపాకి, సర్కార్ సినిమాలు చేశారు. ఈ సినిమాలన్నీ మంచి టాక్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. వాస్తవానికి తుపాకి, కత్తి సినిమాల తర్వాత మురుగదాస్ విజయ్ తో చేయాలనుకున్న సినిమా సర్కార్ కాదట. కత్తి, తుపాకి సక్సెస్ తర్వాత విజయ్ తో తాను చేయాలనుకున్న సినిమా వేరే అని మురుగదాస్ రీసెంట్ గా మదరాసి మూవీ ప్రమోషన్స్ లో వెల్లడించారు.
రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత దళపతి విజయ్ తో తానొక రోడ్ ట్రిప్ సినిమాను తీయాలనుకున్నట్టు మురుగదాస్ తాజాగా వెల్లడించారు. డ్రై యాక్షన్ సీన్స్ తో ఆ సినిమాను నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిద్దామనుకున్నానని, కానీ తర్వాత ప్లాన్స్ మొత్తం మారిపోయి, సర్కార్ సినిమా చేయాల్సి వచ్చిందని మురుగదాస్ తెలిపారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సెప్టెంబర్ 5న మదరాసి రిలీజ్
ఈ సినిమాలో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక మదరాసి విషయానికొస్తే మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివ కార్తికేయన్, రుక్మిణి వసంత హీరోహీరోయిన్లుగా నటించగా సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.