రేస్ కి వెళ్ళేముందు పబ్లిక్ లో అలాంటి పని చేసిన అజిత్.. వీడియో వైరల్!

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు కార్ రేస్ లలో పాల్గొంటూ తన అభిరుచిని చాటుకుంటున్నారు.;

Update: 2025-12-15 10:30 GMT

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు కార్ రేస్ లలో పాల్గొంటూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై నిర్వహించే ఈ కార్ రేసులలో పాల్గొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈయన.. ఇప్పుడు మరోసారి కార్ రేసింగ్ లో పాల్గొన్నారు. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా తాజాగా రేస్ కి వెళ్లే ముందు పబ్లిక్ లో తన భార్యతో అలాంటి పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అజిత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అజిత్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న అంతర్జాతీయ కార్ రేస్ పోటీలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీకి సిద్ధమవుతున్న ఈయన.. అక్కడికి వచ్చిన తన భార్యతో మాట్లాడి రేస్ లో పాల్గొనడానికి బయలుదేరారు. కానీ మళ్ళీ వెనుతిరిగి వచ్చి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు అజిత్. ఇకపోతే ప్రముఖ హీరోయిన్ బేబీ షాలినితో ఏడడుగులు వేసిన అజిత్.. ఆదర్శ జంటగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా తన భార్యకు అందరి ముందు ముద్దు పెట్టి ఆమెపై ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరిచారు అజిత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే..చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు తన 64వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రసారం జరుగుతోంది. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా శ్రీలీలతో పాటు రెజీనా ఇందులో హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే హీరోయిన్స్ విషయంలో అలాగే కథ విషయంలో పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

అజిత్ కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ హీరోయిన్ షాలినితో 2000లో ఏడడుగులు వేశారు. వివాహం తర్వాత రెండు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఈ జంటకు ఒక కొడుకు, కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. అజిత్ చదివింది పదవ తరగతి అయినా.. బహు భాషా కోవిదుడు అని చెప్పవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. తన నటనతో కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకుని భారీ పాపులారిటీ అందుకున్నారు.



Tags:    

Similar News