రాజా సాబ్.. ఊహించిన దాని కంటే ఎక్కువగానే వచ్చింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది రాజా సాబ్. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది రాజా సాబ్. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ది రాజా సాబ్ మిక్డ్స్ టాక్ ను తెచ్చుకుంది. ఆడియన్స్ నుంచి రాజా సాబ్ కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మూవీకి ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాజా సాబ్ బ్లాక్ బస్టర్ మీట్ పేరిట ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ మారుతి, నిర్మాత టిజి విశ్వప్రసాద్ తో పాటూ ముగ్గురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. ఈవెంట్ లో భాగంగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ గురించి మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.
రూ.100 కోట్లు అనుకుంటే రూ.112 కోట్లు వచ్చాయి
రాజా సాబ్ సినిమా రిజల్ట్ విషయంలో తాము చాలా సంతోషంగా ఉన్నామని, సినిమా రిలీజవక ముందు రాజా సాబ్ డే1 రూ.100 కోట్లు దాటుతుందనుకున్నామని కానీ తాము ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.112 కోట్లు వచ్చాయని, ఇది తమకు చాలా పెద్ద విషయమని అందుకే ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్టు నిర్మాత విశ్వప్రసాద్ చెప్పారు.
మిక్డ్స్ రియాక్షన్స్ ఉన్న మాట నిజమే
రాజా సాబ్ ఓ హార్రర్ ఫాంటసీతో వచ్చిన సినిమా అని, ఇప్పుడిప్పుడే చిన్న పిల్లలతో కలిసి ఫ్యామిలీలు థియేటర్లకు రావడం మొదలుపెట్టాయని ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి ఆసక్తికరంగానే ఉన్నారని చెప్పారు. అయితే ఈ సినిమా విషయంలో స్టోరీ పరంగా కొందరి నుంచి మిక్డ్స్ రియాక్షన్ ఉన్నప్పటికీ రాజా సాబ్ సంక్రాంతి సీజన్ లో వచ్చిన మంచి సినిమా అవుతుందని ఆయన పేర్కొన్నారు.
10 రోజులు ఆగితే తెలుస్తోంది
సినిమా రిజల్ట్ ఏంటనేది ఒక షో లోనో, ఒక రోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదని, సంక్రాంతి పండగ రానుందని, మరో 10 రోజులు ఆగితే రాజా సాబ్ సినిమా అంటే ఏంటో తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. మరి చిత్ర దర్శకనిర్మాతలు చెప్తున్నట్టు పండగ సీజన్ లో రాజా సాబ్ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.