అబ్బవరం చెప్పినదే రిపీట్.. ప్రభాస్, చిరు చిత్రాలకు సేమ్ సీన్!

సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ప్రభాస్, చిరంజీవి.. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు మూవీలతో రానున్నారు.;

Update: 2026-01-04 16:30 GMT

సినీ ఇండస్ట్రీలో భాషాబిభేదంపై ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తెలుగులో ఏ లాంగ్వేజ్ మూవీ అయినా కంటెంట్ బాగుంటే బ్రహ్మరథం పడతారు. కానీ మిగతా భాషల్లో అలా లేదని చెబుతుంటారు. తెలుగు హీరోల సినిమాలను ఆదరించరని అంటుంటారు.

అందుకు ఎగ్జాంపుల్ గా తమిళనాడులో తెలుగు హీరోల సినిమాలకు థియేటర్లు దొరకపోవడం! ఇది కొన్నాళ్లుగా జరుగుతూనే ఉండగా.. కొన్ని నెలల క్రితం కిరణ్ అబ్బవరం అదే విషయాన్ని తన సినిమా కె ర్యాంప్ మూవీ ప్రమోషన్స్ లో ప్రస్తావించారు. తెలుగు సినిమాలకు తమిళనాడులో స్క్రీన్స్ ఇవ్వడం లేదని అబ్బవరం చెప్పారు.

అదే సమయానికి తమిళ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఫుల్ గా స్క్రీన్స్ దొరుకుతున్నాయని అన్నారు. దీంతో అప్పట్లో ఆ విషయం హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు మళ్ళీ దానికోసమే డిస్కస్ చేసుకుంటున్నారు. అబ్బవరం చెప్పినది రియలేనని పలువురు నెటిజన్లు చెబుతూ.. ఆ వీడియో పోస్ట్ చేస్తున్నారు.

ఎందుకంటే ఆయన చెప్పినట్లే ఇప్పుడు సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల విషయంలో జరిగింది. సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ప్రభాస్, చిరంజీవి.. రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు మూవీలతో రానున్నారు. కోలీవుడ్ నుంచి విజయ్ దళపతి, శివకార్తికేయన్.. జన నాయగన్, పరాశక్తి చిత్రాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

అయితే విజయ్ దళపతి మూవీకి తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు పెద్ద సంఖ్యలో థియేటర్స్ లో దొరికాయని టాక్. జనవరి 9వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుండగా.. అదే రోజు ది రాజా సాబ్ కూడా థియేటర్స్ లోకి రానుంది. కానీ ప్రభాస్ మూవీకి తమిళనాడులో అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దొరకలేదని వినికిడి. ప్రభాస్ కు కోలీవుడ్ లో ఉన్నంత క్రేజ్.. టాలీవుడ్ లో విజయ్ కు లేదు.

కానీ థియేటర్స్ విషయంలో ఆ వేరియేషన్ చాలా తేడా ఉంది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న ప్రభాస్ మూవీకి తమిళనాడులో థియేటర్స్ దొరకపోయినా.. విజయ్ సినిమాకు మాత్రం ఈజీగా మన దగ్గర దొరికేశాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో కూడా అలాగే జరిగిందని ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీంతో మళ్లీ ఇప్పుడు భాషాబిభేదం తెరపైకి వచ్చింది. కిరణ్ అబ్బవరం ఆవేదన చెందిన విషయమే మళ్లీ ఇప్పుడు రిపీట్ అయింది. అప్పుడు కిరణ్ అబ్బవరం ఆ విషయంలో లాజిక్ ఏంటో తెలియదు అన్నారు. ఇంటర్వ్యూలో బ్రేక్ చేయలేకపోయారు. మరి దానిపై ఇప్పుడు చిరంజీవి, ప్రభాస్ సినిమాల టీమ్ రెస్పాండ్ అవుతాయేమో వేచి చూడాలి.

Tags:    

Similar News