కొత్త క‌థ‌ల‌ కోసం క‌న్య్పూజ‌న్ లో!

రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, ఎన్టీఆర్, బ‌న్నీ, మ‌హ‌ష్ లు ఓ వేవ్ లో వెళ్లిపోతున్నారు. పాన్ ఇండియా స్టార్లు కావ‌డంతో? ఆ ఇమేజ్ లో సినిమాలు చేస్తూ స్థాయిని పెంచుకుంటారు.;

Update: 2025-08-30 20:30 GMT

రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్, ఎన్టీఆర్, బ‌న్నీ, మ‌హ‌ష్ లు ఓ వేవ్ లో వెళ్లిపోతున్నారు. పాన్ ఇండియా స్టార్లు కావ‌డంతో? ఆ ఇమేజ్ లో సినిమాలు చేస్తూ స్థాయిని పెంచుకుంటారు. వాళ్ల‌కు దొరుకుతున్న ద‌ర్శ‌కులు పేరున్న వాళ్లు కావ‌డంతో? కొత్త‌గా వారు క‌థ‌ల‌పై మ‌రీ అంత దృష్టి పెట్టే ప‌నిలేకుండా బండి లాగించే స్తున్నారు. ఒక‌వేళ ఒక సినిమా అటు ఇటు అయినా? ఆ న‌ష్టాన్ని త‌ర్వాత సినిమా ఫ‌లితంతో బ్యాలెన్స్ చేస్తున్నారు. దీంతో ఇమేజ్ పై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌కుండా త‌ప్పించుకోగ‌ల్గుతున్నారు.

భారీ ఎత్తున ప్యాన్ బేస్ ఉన్న హీరోలు కాబ‌ట్టి వాళ్ల‌కిది సాధ్య‌మే. కానీ టైర్ 2, టైర్ 3 హీరోలే స‌రైన క‌థ‌లు, ద‌ర్శ‌కులు దొర‌క‌క ఇబ్బంది ప‌డుతున్నారు. రాక రాక ఒక విజ‌యం వ‌చ్చిందంటే? త‌ర్వాత సినిమా ప్లాప్ తో మ‌ళ్లీ ప‌రిస్థితి మొద‌టికే వ‌స్తుంది. స‌క్సెస్ తో బౌన్స్ బ్యాక్ అవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌డు తుంది. అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య 100 కోట్ల క్ల‌బ్ లోకి చేర‌డానికి ఎంత శ్ర‌మించాల్సి వ‌చ్చిందో తెలిసిందే. ఎన్నో వైఫ‌ల్యాలు..చిన్న పాటి స‌క్స‌స్ ల త‌ర్వాత `తండేల్` తో 100 కోట్ల క్ల‌బ్ లోకి అడుగు పెట్టారు.

దీంతో అక్కినేని ఫ్యామిలీ స‌హా అభిమానులు ఎంతో సంతోష‌ప‌డ్డారు. అదే స‌క్స‌స్ ను కొన‌సాగించాల‌ని చైత‌న్య త‌దుప‌రి సినిమాల ప్ర‌ణాళిక సిద్దం చేసుకుని ముందుకెళ్తున్నాడు. తండేల్ ముందు వ‌ర‌కూ చైత‌న్య కెరీర్ డ‌ల్ గానే సాగింది. సినిమాలు చేసినా అంచ‌నాలు త‌ప్ప‌డంతోనే ఈ ప‌రిస్థితి. శ‌ర్వానంద్, నితిన్, అఖిల్ లాంటి హీరోలు వ‌రుస ప్లాప్ ల్లో ఉన్నారు. క‌థ‌ల వైఫ‌ల్యంతోనే వాళ్ల‌కీ ప‌రిస్థితి. ఎంతో న‌మ్మి చేసినా ఫ‌లితాలు ఆశించిన విధంగా రావ‌డం లేదు. అయితే ఈ ప్లాప్ కంటెంట్ కి కార‌ణంగా క‌న్య్పూజ‌న్ కి గుర‌వ్వ‌డం ప్రధాన కార‌ణంగా ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

మంచి క‌థ‌ల కోసం ఎదురు చూసే క్ర‌మంలో స‌మ‌యం వృద్ధాగా పోతుంది. స‌మయం వృద్ధా అయిపో తుంద‌ని కంగారులో క్లారిటీ లేని క‌థ‌ల‌తో ముందుకు రావ‌డం మ‌రో వైఫ‌ల్యంగా క‌నిపిస్తుందంటున్నారు. `విరూపాక్ష` త‌ర్వాత సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా మొద‌లు పెట్ట‌డానికి రెండేళ్లు ప‌ట్టింది. వైష్ణ‌వ్ తేజ్ కూడా ప్లాప్ వ‌చ్చిన త‌ర్వాత హిట్ సినిమాతోనే రావాల‌ని సంక‌ల్పించి ఇంత వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌టిం చ‌లేదు. ఇంకా ఇలాంటి హీరోలెంతో మంది. వీళ్లంద‌ర్నీ క్రోడీక‌రించి చూస్తే చాలా మంది స్టార్లు స్టోరీ జాన‌ర్ ప‌రంగా క‌న్ప్యూజ‌న్ కుగుర‌వుతున్నార‌నే విష‌యం తెర మీద‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో కొంద‌రు స్టార్లు మ‌రింత గ్రౌండ్ వ‌ర్క్ చేయాల్సిందిగా విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News