కంటెంట్ మోజులో కిల్ అవుతోన్న డాన్స్!

పాన్ ఇండియా ట్రెండ్, సినిమాటిక్ యూనివ‌ర్శ్ మొద‌లైన నేప‌థ్యంలో భ‌విష్య‌త్ లో పాట‌ల ప్రాధాన్య‌త మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది.;

Update: 2025-09-14 23:30 GMT

ఒకప్పుడు సినిమా అంటే ఆరు పాట‌లు త‌ప్ప‌నిస‌రి. అందులో ఓ ఐటం పాట ఉండేది. పెద్ద స్టార్ సినిమా అయినా, చిన్న స్టార్ తో సినిమా అయినా సినిమాకివి త‌ప్ప‌నిస‌రిగా భావించేవారు. క‌థ, క‌థ‌నాల‌ సంగ‌తి ఎలా ఉన్నా? వీటికి మాత్రం ప్రాధాన్య‌త ఉండేది. కానీ నేటి సినిమా స‌న్నివేశం మాత్రం అందుకు భిన్నం. పాట‌, ఐటం పాట‌ల కంటే క‌థ, క‌థ‌నం, నేప‌థ్య సంగీతంకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. కంటెంట్ కి ఉన్న ప్రాధాత‌న్యత దేనికి లేదు. పాన్ ఇండియా ట్రెండ్, సినిమాటిక్ యూనివ‌ర్శ్ మొద‌లైన నేప‌థ్యంలో భ‌విష్య‌త్ లో పాట‌ల ప్రాధాన్య‌త మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది.

తార‌క్ కూడా దూరంగానే:

ఇప్ప‌టికే పాట‌లు...అందులో డాన్సుల గురించి పెద్ద‌గా చ‌ర్చ‌కు రావ‌డం లేదు. పాట‌లు ఎలా ఉన్నా బీజీఎం ఎలా ఉంది? విజువ‌ల్ ఎఫెక్స్ట్ ఎలా ఉన్నాయి? అన్న దానిపై చ‌ర్చ హైలైట్ అవుతుంది. అయితే ఇలా స్టార్స్ అంతా డాన్సుల‌కు దూరమ‌వ్వ‌డం అన్న‌ది మాస్ లో కాస్త క‌ల‌వారినికి గుర‌వుతుంది. అద్భుత‌మైన డాన్సింగ్ స్టార్స్ ఉన్నా వాళ్ల‌ను కంటెంట్ మోజులో ప‌డి వినియోగించుకోవ‌డం లేదనే అసంతృప్తి ఉంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి డాన్స‌ర్. కానీ `దేవ‌ర` సినిమాలో ఆయ‌న బ్రాండ్ ఎక్క‌డా ప‌డ‌లేదు. కంటెంట్ ఆధారంగానే సాంగ్స్ కంపోజింగ్ జ‌ర‌గ‌డంతో ఛాన్స్ లేకుండా పోయింది.

ద‌ర్శ‌కుల మాటే వేదంగా:

ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ తో తార‌క్ `డ్రాగ‌న్` సినిమా చేస్తున్నాడు. ఇందులో పాట‌లు లేవ‌ని వినిపిస్తోంది. అంటే తార‌క్ డాన్సులు ఇందులోనూ క‌నిపించ‌వు. ఇక ప్ర‌భాస్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సినిమాల్లో పాట‌లే క‌నిపించ‌డం లేదు. `స‌లార్` లో ఒక్క పాట కూడా ఉండదు. అటుపై రిలీజ్ అయిన `క‌ల్కి 2898` లో ప్ర‌భాస్ భీభ‌త్సంగా డాన్సులు చేసే పాట‌లంటూ ఏవీ లేవు. నాగీ కంటెంట్ పై పెట్టిన శ్ర‌ద్ద పాటల‌పై పెద్ద‌గా పెట్ట‌లేదు. `పౌజీ`లో కూడా పాట‌లు ఉన్నాయా? లేదా? అన్న‌ది సందేహ‌మే. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కూడా కంటెంట్ ని డిస్ట‌ర్బ్ చేసే టైపు కాదు.

గ్లోబ‌ల్ మూవీస్ లోనూ ఛాన్సెస్ త‌క్కువే:

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో కూడా పెద్ద‌గా డాన్సులు క‌నిపించ‌డం లేదు. `అత్తారింటికి దారేది` త‌ర్వాత రిలీజ్ అయిన ఏ చిత్రంలో ప‌వ‌న్ డాన్సులు ఎక్క‌డా హైలైట్ కాలేదు. రీసెం ట్ రిలీజ్ `హ‌రిహ‌ర‌మ‌ల్లు`లో పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ ఇవ్వ‌లేదు. అలాగే త్వర‌లో రిలీజ్ అవుతోన్న పాన్ ఇండియా చిత్రం `ఓజీ` లో కూడా పాట‌ల‌కు ఛాన్సెస్ త‌క్కువ‌గానే ఉన్నాయి అన్న టాక్ న‌డుస్తోంది. బ‌న్నీ 22వ చిత్రంలో కూడా పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అట్లీ ఈసారి పూర్తిగా గ్లోబ‌ల్ స్థాయిలో హైలైట్ చేసే ప్ర‌క్రియ లో భాగంగా కంటెంట్ పైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన‌ట్లు విని పిస్తోంది.

ద‌ర్శ‌క‌శిఖ‌రం కూడా దూరంగానే:

ఇక ఎస్ ఎస్ ఎంబీ 29 రాజ‌మౌళి ఈ విష‌యంలో ఎంత మాత్రం రిస్క్ తీసుకోరు. ఆయ‌న కంటెంట్ కింగ్. పాట‌లున్నా? కంటెంట్ డీవీయేట్ కాకుండానే డిజైన్ చేస్తారు. పైగా ఇదొక అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యం కాబ‌ట్టి మ‌హేష్ తో అంత రిస్క్ తీసుకునే అవ‌కాశాలు త‌క్కువే. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ `విశ్వంభ‌ర`లో కూడా చిరులో మైకెల్ జాక్స‌న్ ని వినియోగించుకునే అవ‌కాశాలు త‌క్కువ గానే ఉన్నాయి. రీసెంట్ రిలీజ్ `మిరాయ్` లో `వైబ్` పాట ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలిసిందే.కానీ ఆ పాట‌ను ప్ర‌మోష‌న్ వ‌ర‌కే ప‌రిమితం చేసారు. సినిమాలో ఆ పాట లేదు. కంటెంట్ కి అంత‌రాయం క‌లు గుతుంద‌నే ద‌ర్శ‌కుడు కార్తీక్ తొల‌గించాడు. ఇలా డైరెక్ట‌ర్లు అంతా కంటెంట్ కి ఇచ్చిన ప్రాధాన్య‌త హీరోల డాన్సుల‌కు ఇవ్వ‌డం లేద‌న్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News