• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజ సజ్జా.. ఈసారి...

తేజ సజ్జా.. ఈసారి సీక్రెట్ హిస్టరీతో..

| ఇక తేజ సజ్జా కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-04-13 15:12 GMT

స్టార్ హీరోగా హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న తర్వాత అతనికి ప్రముఖ ప్రొడక్షన్స్ నుంచి మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇక తేజ సజ్జా కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు ఏ మాత్రం టచ్ చేయకుండా వీలైనంత ఎక్కువగా ఎవరికీ తెలియని పాయింట్స్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు అనిపిస్తోంది.

పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ రావడంతో నిర్మాతలు కూడా తేజ కోసం అలాంటి కధలే సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ హీరో నుంచి రాబోయే సినిమాలలో ఒకదాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ ఇదివరకే వైరల్ అయ్యాయి. రీసెంట్ గా అఫీషియల్ గా ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

మరో క్రేజీ అప్డేట్ కూడా రెండు రోజుల్లో రాబోతోంది.. అంటూ అందులో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా చారిత్రక అంశతోనే ఆ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేసేది మరేవరో కాదు.. రాలేటెడ్ యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. చరిత్రను తిరగరాసే రహస్యం అంటూ ఒక అద్భుతమైన క్యాప్షన్ తో ఆసక్తికరమైన పోస్టర్లను విడుదల చేశారు.

అందులో ప్రతి చరిత్రకు ఒక సీక్రెట్ ఉంటుంది అని, కానీ ఈ సీక్రెట్ లో ఒక చరిత్ర ఉంది అంటూ పోస్టర్లో వివరణ ఇచ్చారు. ఈ సినిమాకు సూపర్ యోధ అనే టైటిల్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 15వ తేదీన మరొక అప్డేట్ ద్వారా మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. మరొక ఆసక్తికరమైన విశేషం ఏమిటి అంటే మంచు మనోజ్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ విషయంలో కూడా త్వరలోనే ఒక అప్డేట్ రాబోతోంది. మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తే మాత్రం తప్పకుండా సినిమాకు హై లెవెల్లో హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మలయాళం టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ఇంపార్టెంట్ పాత్రలో అరగంట కనిపిస్తాడని కూడా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

A SECRET that WILL re-write HISTORY 📜🔥

Unveiling #SuperYodha 🥷 in the Prestigious #PMF36 with a MIGHTY ANNOUNCEMENT on APRIL 15th❤️‍🔥

Stay tuned to @PeopleMediaFcy 💥💥 pic.twitter.com/JnaslGlL2K

— People Media Factory (@peoplemediafcy) April 13, 2024
Tags:    
  • TeluguFilmIndustry 
  • Hanuman 
  • Tejasajja 
  • KarthikGhattamaneni 
  • Eagle 
  • PeopleMediaFactory 
  • PMF36 
  • SuperYodha 
  • ManchuManoj 
  • DulquerSalmaan 
  • RitikaNayak 

Similar News

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

Copyright @2026

Powered by Blink CMS