తేజ కూడా వారినే ఫాలో అయితే ఎలా?
జాంబి రెడ్డి, హను మాన్ తో సూపర్ సక్సెస్‌లను అందుకున్న తేజ రీసెంట్ గా మిరాయ్ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ ను అందుకున్నారు.;
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసిన తేజ సజ్జా వరుస సక్సెస్‌లతో కెరీర్లో దూసుకెళ్తున్నారు. జాంబి రెడ్డి, హను మాన్ తో సూపర్ సక్సెస్‌లను అందుకున్న తేజ రీసెంట్ గా మిరాయ్ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ ను అందుకున్నారు. హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ ఆ సినిమా తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్నారు.
సక్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తున్న మిరాయ్
ఆ గ్యాప్ ను చూసి సక్సెస్ తర్వాత కూడా ఇంత లేటేంటని అందరూ అనుకున్నారు. కానీ తేజ వెయిట్ చేసినందుకు మిరాయ్ అతనికి చాలా మంచి రిజల్ట్‌ను ఇచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేయడంతో హైప్ తో పాటూ మార్కెటింగ్ కూడా బాగా జరిగి నార్త్ లో కూడా మిరాయ్ మంచి టాక్ తో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.
జాంబిరెడ్డ2ను లైన్ లో పెట్టిన తేజ
మిరాయ్ సూపర్ సక్సెస్ తర్వాత తేజ సజ్జా నెక్ట్స్ ఏం చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో జాంబిరెడ్డి సీక్వెల్ జాంబిరెడ్డి2 ను లైన్ లో పెట్టారు. ఈ సినిమాను కూడా మిరాయ్ ను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించనుంది. సక్సెస్‌ఫుల్ మూవీ జాంబిరెడ్డికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించనుండగా, రానా నాయుడు ఫేమ్ సుపర్ణ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది.
2027 సంక్రాంతికి జాంబిరెడ్డి2
జాంబిరెడ్డి త్వరలోనే మొదలవనుందంటున్నారు కానీ సినిమా ఎప్పుడు మొదలైనా రిలీజ్ మాత్రం 2027 సంక్రాంతి అంటున్నారు. అంటే దాదాపు మరో ఏడాదిన్నర టైముంది. వీఎఫెక్స్, క్వాలిటీ బట్టి చూస్తే అది తక్కువ టైమే పైగా ఈలోపు సినిమా పూర్తవుతుందని గ్యారెంటీ కూడా లేదు. మిరాయ్ కూడా ది బెస్ట్ అవుట్‌పుట్ ను ఇవ్వాలనే ఉద్దేశంతో పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు జాంబిరెడ్డి2 కూడా అదే పద్దతిని ఫాలో అయినా చెప్పలేం.
అయితే ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తేజ ఆలోచిస్తున్న విధానం బావుంది కానీ కెరీర్లోని ప్రైమ్ టైమ్ ను తేజ ఇలా స్లో గా కొనసాగిస్తే కెరీర్లో ఎక్కువ సినిమాలు చేయలేరని అందరూ అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోలంతా ఒక్కో సినిమాకు దాదాపు రెండేళ్లు తీసుకుంటున్న నేపథ్యంలో తేజ కూడా వారినే ఫాలో అయితే ఎలా అంటున్నారు. కేవలం ఫాంటసీ సినిమాలు మాత్రమే కాకుండా అన్ని రకాల జానర్లలో తేజ ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో తేజ ఏం ఆలోచిస్తున్నారో.