• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజ సజ్జ.. ఈసారి లెక్క...

తేజ సజ్జ.. ఈసారి లెక్క ఇంకా పెద్దదే!

| ‘హనుమాన్’, ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జ సినిమాల మీద అంచనాలు పూర్తిగా మారిపోయాయి.

By - M Prashanth
Update: 2026-08-22 15:06 GMT

‘హనుమాన్’, ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జ సినిమాల మీద అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చిన్న బడ్జెట్‌లో కొత్త కథలు ప్రయత్నించే హీరోగా కనిపించిన తేజ.. ఇప్పుడు తన ప్రతి సినిమాను పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేస్తున్న కొత్త సినిమా మాత్రం ఆయన కెరీర్‌లో మొదటి హిట్‌ను మళ్లీ గుర్తు చేస్తోంది. అదే ‘జాంబీ రెడ్డి’.




 


ఈ సినిమా నుంచి ఆగస్టు 23న ఉదయం 10:08 గంటలకు కొత్త అప్డేట్ ను ఇవ్వనున్నారు. దానికి ముందు వదిలిన పోస్టర్‌లో తేజ ముఖాన్ని పూర్తిగా చూపించలేదు. రక్తంతో ఉన్న చేతిని మాత్రం హైలైట్ చేశారు. పైగా రేపు విధ్వంసం మొదలవుతుందనే అర్థం వచ్చేలా పోస్టర్‌పై లైన్ పెట్టారు. చూస్తుంటే మరోసారి జాంబీస్ చుట్టూ కథ ఉండబోతోందనే ఆసక్తి కలుగుతోంది.

తేజకు ‘జాంబీ రెడ్డి’ చాలా కీలకమైన సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 2021లో వచ్చిన ఆ సినిమాతోనే సోలో హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. రాయలసీమలోని ఒక గ్రామం, అక్కడికి జాంబీస్ రావడం.. మధ్యలో కామెడీతో ఆ కథను నడిపించారు. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన ఈ ప్రయత్నం బాక్సాఫీస్ దగ్గర కూడా వర్కవుట్ అయింది. అందుకే దీనికి రెండో భాగం ఉంటుందనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది.

ఇప్పుడు తేజ చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ వచ్చినప్పుడే మరో ఆసక్తికరమైన లైన్ పెట్టారు. ‘రాయలసీమ నుంచి ప్రపంచం అంతం వరకు’ అనే అర్థం వచ్చేలా దాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు కొత్త పోస్టర్‌లో ఏకంగా ప్రపంచ విధ్వంసాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు కలిపి చూస్తే ‘జాంబీ రెడ్డి’లో ఒక ప్రాంతానికి పరిమితమైన కథను ఈసారి చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నారా అనే ఆసక్తి వస్తోంది.

పైగా ‘జాంబీ రెడ్డి 2’ కథ సిద్ధంగా ఉందనే వార్తలు గతంలోనే వచ్చాయి. ప్రశాంత్ వర్మ కథ అందిస్తారని, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు కూడా అప్పటినుంచే ఈ ప్రాజెక్టుతో వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం తేజ చేస్తున్న సినిమా అదేనా.. లేక జాంబీస్ నేపథ్యంలో పూర్తిగా మరో కథను సిద్ధం చేశారా అన్నది రేపటి ప్రకటనతో తేలే అవకాశం ఉంది.

Tags:    
  • tejasajja 
  • zombiereddy 
  • zombiereddy2 
  • prashanthvarma 
  • peoplemediafactory 

Similar News

ఈ కొత్త హీరోయిన్‌కు డబుల్ ఛాన్స్ ఉందే!

2026-11-25 06:04 GMT

పవన్ కళ్యాణ్‌తో గత జీవితం.. సంపాదన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణు దేశాయ్

2026-11-25 06:04 GMT

టాలెంట్ ఉందంటారు.. మరి ఛాన్స్ ఎందుకివ్వరు!

2026-11-25 06:04 GMT

రాజమౌళి కొడుక్కి తెలుగు టైటిల్ దొరకలేదా..?

2026-11-25 06:03 GMT

ఎలిగెంట్ లుక్‌లో ఆకట్టుకున్న నమ్రతా శిరోద్కర్

2026-11-25 05:14 GMT

ఒక్క మెయిల్‌తో విశ్వక్ కెరీర్ ఆగిపోయేదా!

2026-11-25 04:40 GMT

మాస్ సంచ‌ల‌నం వాట్ నెక్స్ట్ ?

2026-11-25 04:39 GMT

మహేష్ బాబు ఎంకరేజ్ చేసిన ఆ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఏమైపోయాడు...

2026-11-25 04:23 GMT

తరుణ్ భాస్కర్.. హర్టయ్యారా?

2026-11-25 04:10 GMT

'పాకెట్ రాకెట్స్' సాంగ్.. అమ్మాయి మాయలో పడితే అంతే..

2026-11-25 04:04 GMT

తెలుగులో డిటెక్టివ్ కథలతో సినిమాలు ఎందుకు రావడం లేదు...

2026-11-25 04:04 GMT

పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబోలో ఆ సినిమా వచ్చి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదా?

2026-11-25 04:03 GMT

Copyright @2026

Powered by Blink CMS