మిరాయ్: ఫాంటసీ అడ్వేంచర్ లో కంప్లీట్ ప్యాకేజీ

హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.;

Update: 2025-08-28 17:03 GMT

హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. విజువల్ వండర్స్, యాక్షన్ సీన్స్ తో ఉన్న ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.

అయితే వరుస రెండు సినిమాలు పాన్ఇండియా రేంజ్ లో సినిమాలు చేయడంతో తేజను పాన్ఇండియా స్టార్ అని పిలుస్తున్నారు. దీనిపై తేజ స్పందించాడు. నన్ను పాన్ఇండియా హీరో అని పిలుస్తున్నారు. కానీ నేను దానిని అలా చూడను. నేను ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం సినిమాలు తీస్తున్నాను. నా సినిమాలు పాన్ఇండియా లెవెల్ లో ఆడితే సంతోషమే. అంతకుమించి నాకు సంతోషాన్నిచ్చేది ఏదీ లేదు.

హనుమాన్ సినిమా విడుదలకు ముందే మిరాయ్ సినిమాకి కమిట్ అయిన తేజ, ఈరోజు కూడా ఈ సినిమా చేయాలని ఎంచుకుంటానని, ఇది గొప్ప ప్రాజెక్ట్ అని అన్నాడు. భవిష్యత్తులో దర్శకుడు కార్తీక్‌ తో మళ్ళీ కలిసి పని చేయాలనుకుంటున్నట్లు వ్యక్తం చేశాడు. అలాగే తేజ తన నిర్మాత విశ్వ ప్రసాద్, సహనటులు మనోజ్ మంచు, శ్రియ శరణ్, జగపతి బాబులను కూడా ప్రశంసించారు.

ఇందులో అశోకం వంటి అంశాలు, రహస్యాలతో నిండిన పుస్తకాలు, వాటిని రక్షించడానికి హీరో చేసిన సాహసోపేత జర్నీ మరెన్నో ఉన్నాయి. ఒక కొడుకు తన తల్లి కోరికను నెరవేర్చడానికి ఎంత దూరం వెళ్తాడు అనేది సినిమా స్టోరీ. అలాగే మిరాయ్‌ అనేది ఫాంటసీ, యాక్షన్, సాహసం, భావోద్వేగం, ఎలివేషన్, భక్తి అంశాలతో కూడిన పూర్తి ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజీ అని అన్నాడు.

అయితే సినిమా సెప్టెంబర్ 05న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సినిమా 12కు వాయిదా పడింది. టీజర్ తోనే హైప్ క్రియేట్ అయ్యింది. ఈసినిమా ఇంకా ట్రైలర్ తో మరింత అంచనాలు పెంచేసింది. ఇందులో స్టార్ హీరో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. ఆయన రోల్ కూడా మంచి స్కోప్ ఉన్నట్లే కనిపిస్తుంది. సీనియర్ నటులు శ్రియా శరణ్, జగపతి బాబు కూడా ఆయా పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News