మిరాయ్ యాక్షన్ గేర్.. టీజర్ కి ముందు కిక్కిచ్చిన పోస్టర్

తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్‌ ప్రకారం, మిరాయ్ మూవీ టీజర్‌ను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు.;

Update: 2025-05-26 09:11 GMT

హనుమాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'మిరాయ్'. ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్‌తో, ఇండియన్ హై ఫై విజువల్ ట్రీట్ అందించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని విజన్‌తో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.


తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్‌ ప్రకారం, మిరాయ్ మూవీ టీజర్‌ను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. పోస్టర్‌లో కనిపించిన లుక్‌లో తేజ సజ్జా రైలు మీద యాక్షన్ మోడ్‌లో కనిపించాడు. బ్యాక్‌డ్రాప్‌లో సూపర్ యోధుడిగా ఉన్న తేజ గెటప్, లోకేషన్ కంటెంట్‌ని బట్టి టీజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితికా నాయక్ నటిస్తోంది. మరోవైపు మంచు మనోజ్ ఓ పవర్‌ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడు. వీళ్ల ముగ్గురి మధ్య వచ్చే ఎమోషన్, యాక్షన్, డ్రామా అంశాలే సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు 2D, 3D ఫార్మాట్లలో ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తి కాగా, ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో ప్రమోషన్స్ వేగం పెరిగింది. సినిమా మొత్తం విజువల్ మాస్టర్ పీస్‌గా ఉండేలా దర్శకుడు కార్తీక్ పక్కా ప్లాన్‌తో తెరకెక్కిస్తున్నాడు. గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్‌పై భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఒక గేమ్ చెంజర్ మూవీ అవుతుందనే నమ్మకంతో యూనిట్ ముందుకెళ్తోంది.

హనుమాన్ తర్వాత తేజ నుంచి వస్తున్న ఈ మాస్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ సినిమాపై బజ్‌ను రెట్టింపు చేస్తోంది. టీజర్ ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి ఇది పక్కా విజువల్ సూపర్ హిట్ అనే అర్థమవుతోంది. ఇక తేజ సజ్జా మరోసారి హనుమాన్ రేంజ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Tags:    

Similar News