తేజ సజ్జా 'మిరాయ్'.. సాలిడ్ అప్డేట్ వచ్చిందిగా..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా బ్లాక్ బస్టర్ హిట్ హనుమాన్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆయన యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తేజ సజ్జా సూపర్ యోధ రోల్ ను పోషిస్తున్నారు. మరో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారు. రితికా నాయక్ హీరోయిన్ గా సందడి చేయనున్నారు.
అయితే మిరాయ్ మూవీని ఆగస్టు 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎనిమిది వేర్వేరు భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తేజ సజ్జా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని అంతా అంచనా వేస్తున్నారు.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్.. అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త షూటింగ్ షెడ్యూల్ తాజాగా ముంబైలో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. మెయిన్ క్యాస్టింగ్ పై కీలక సీన్స్ ను తీయనున్నారట.
చారిత్రక గుహల్లో కీలకమైన సన్నివేశాలు మేకర్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కొత్త షూటింగ్ షెడ్యూల్ లో తేజ సజ్జాతో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొన్నట్లు సమాచారం. ప్రతీ సీన్ కూడా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
క్రేజీ అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు. అదే సమయంలో మూవీ ప్రతి ఒక్కరికీ విజువల్ వండర్ గా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని మిరాయ్ మేకర్స్ ఇప్పటికే హామీ ఇచ్చారు. మరి సినిమా ఎలా మెప్పిస్తుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.