మహేష్ బాబుతో లేటవుతుందని మరో హీరోతో..
సినీ ఇండస్ట్రీలో రైటర్లు, డైరెక్టర్లు కథలు రాసుకునేటప్పుడే ఫలానా హీరో అయితే బావుంటుందని ఊహించుకుని వారిని దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకుంటుంటారు.;
సినీ ఇండస్ట్రీలో రైటర్లు, డైరెక్టర్లు కథలు రాసుకునేటప్పుడే ఫలానా హీరో అయితే బావుంటుందని ఊహించుకుని వారిని దృష్టిలో పెట్టుకునే కథలు రాసుకుంటుంటారు. కథలు పూర్తయ్యాక నిర్మాతల దగ్గరకు వెళ్లినప్పుడో, లేదా మరేదైనా పరిస్థితుల్లోనో ఆ కథ వేరే హీరో చేతుల్లోకి మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని రాసిన కథకు మరో హీరోను సెలెక్ట్ చేసుకోవడానికి కొందరు ఒప్పుకుంటే మరికొందరు మాత్రం ఒప్పుకోరు.
తరుణ్ కు హిట్ ఇచ్చిన సుమంత్
అలా టాలీవుడ్ లో ఓ హీరో చేయాల్సిన సినిమా మరొకరు చేయడం, ఓ హీరో కోసం రాసుకున్న కథ మరో నటుడి దగ్గరకు వెళ్లడం చాలా సార్లే జరిగాయి. స్టార్ హీరోలు చేయాల్సిన సినిమాలు యంగ్ హీరోలు చాలా మందే చేసి వాటితో బ్లాక్ బస్టర్లు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన నువ్వే కావాలి సినిమా ముందు సుమంత్ దగ్గరకు వెళ్లి ఆయన వద్దనుకోవడంతోనే తరుణ్ కు ఆ ఛాన్స్ దక్కింది. దాంతో పాటూ మరో హీరో కూడా తరుణ్ కు ఓ పెద్ద హిట్ ను అందించారు. ఆయన మరెవరో కాదు మహేష్ బాబు.
నిర్మాత మాటను రిజెక్ట్ చేసిన విశ్వనాథ్
నటుడు, డైరెక్టర్ గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న కాశీ విశ్వనాథ్ రాసుకున్న లవ్ స్టోరీని నిర్మాత సురేష్ బాబు కు వినిపించగా, ఆయన ఆ సినిమాకు మహేష్ బాబు అయితే బావుంటుందని చెప్పగా దాన్ని విశ్వనాథ్ సున్నితంగానే రిజెక్ట్ చేశారని, మహేష్ తో సినిమా చేయడానికి చాలా మంది క్యూలో ఉంటారు కాబట్టి ఆయనతో సినిమా అంటే లేటవుతుందని అన్నారట.
అప్పటికే నువ్వే కావాలితో హిట్
తాను రాసుకున్న ప్రేమకథకు తరుణ్ అయితే సరిగ్గా సరిపోతాడని, పైగా నువ్వే కావాలితో తరుణ్ హిట్ అందుకున్నాడని సురేష్ బాబుకు చెప్పడంతో అలా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లి 2002లో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తరుణ్ సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. సినిమాలో వీరిద్దరి జంట ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వు లేక నేను కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆ సినిమా మంచి హిట్ అందించింది.