ఆ క్రిటిక్ ను అంతగా ఇబ్బంది పెట్టిన హీరో ఎవరు?
జీవితంలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు చాలా సహజం. సినీ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఎవరైనా లైఫ్ లో సక్సెస్ అవాలనే కోరుకుంటారు.;
జీవితంలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు చాలా సహజం. సినీ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఎవరైనా లైఫ్ లో సక్సెస్ అవాలనే కోరుకుంటారు. ఎవరూ తమంతట తాము ఫెయిల్ అవాలని కోరుకోరు. అయితే సక్సెస్ ను ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తారో, ఫెయిల్యూర్ ను కూడా అంతే హుందాగా యాక్సెప్ట్ చేస్తే గౌరవం పెరుగుతుంది. కానీ కొందరు మాత్రం తమ ఫెయిల్యూర్లను ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
తాము చేసిన సినిమా ఫెయిల్ అయిందని ఆడియన్స్ ఇచ్చిన తీర్పును తీసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. కానీ కొందరు మాత్రం తమ సినిమాకు ఆడియన్స్ ఇచ్చిన తీర్పు కరెక్టే అని భావించి వారిచ్చిన రిజల్ట్ ను గౌరవిస్తారు. మరికొందరు మాత్రం ఆడియన్స్ తీర్పును పక్కన పెట్టి తమ సినిమా హిట్టేనని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. దానికోసం సినీ విమర్శకుల సాయం కూడా తీసుకుంటూ ఉంటారు.
ఇమేజ్ ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు
ఈ నేపథ్యంలోనే మూవీ క్రిటిక్స్ పై కొన్ని సార్లు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కొంతమంది స్టార్లు తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి రివ్యూలను మార్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ విషయాన్ని రీసెంట్ గా ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ యంగ్ హీరో పాజిటివ్ రివ్యూల కోసం తనపై పదే పదే ఒత్తిడి తెచ్చారని చెప్పారు.
ఆ హీరో రిజల్ట్ ను జీర్ణించుకోలేకపోయాడు
అయితే అతను ఎక్కడా ఆ హీరో పేరు మాత్రం ప్రస్తావించలేదు. తరణ్ ఆదర్శ్ చెప్పిన ప్రకారం, ఆ యంగ్ హీరో నటించిన సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. దర్శకనిర్మాతలు ఆడియన్స్ ఇచ్చిన తీర్పుని అంగీకరించినప్పటికీ, హీరో మాత్రం ఆ రిజల్ట్ ను జీర్ణించుకోలేక పదే పదే తనకు మెసెజ్‌లు చేశారని, ఆఖరికి తాను విసిగిపోయి, ఆ సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని చాలా కాన్ఫిడెంట్ గా పెద్ద అక్షరాలతో రిప్లై ఇచ్చినట్టు తెలిపారు.
తరణ్ ఆదర్శ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఆ హీరో ఎవరా అని అందరూ ఆరా తీస్తూ నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా యూజర్లు ఆ హీరో మరెవరో కాదని, కార్తీక్ ఆర్యన్ అని, తరణ్ ఆదర్శ్ చెప్పింది చందు ఛాంపియన్ అనే సినిమా గురించేనని, ఆ మూవీలో కార్తీక్ ఆర్యన్ యాక్టింగ్ ప్రశంసలు అందుకున్నప్పటికీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఫెయిలైందని చెప్తున్నారు. కానీ ఈ విషయంలో తరణ్ ఆదర్శ్ మాత్రం హీరో పేరు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.