30 ప్లస్ తమన్నాతో షష్ఠిపూర్తి హీరో వేషాలేమిటో
ఇప్పుడు `దబాంగ్` టూర్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి వేదికపై డ్యాన్సులు వేస్తున్న తమన్నా వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.;
కథానాయికలు తమకంటే వయసులో చాలా పెద్ద హీరోలతో రొమాన్స్ చేయడం చూస్తున్నదే. స్టార్ల మధ్య వయసు వ్యత్సాసం అన్నివేళలా చర్చనీయాంశంగా మారింది. వయసు మీరిన వృద్ధులతో చాలా చిన్న వయసు నటీమణులతో జత కడుతున్నారు. దీని కారణంగా మహిళలను కేవలం కోరికలు తీర్చుకునే వస్తువులుగా మారుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాల నుంచి సల్మాన్ , అక్షయ్ కుమార్ వరకూ తమకంటే చిన్న వయసులో ఉన్న హీరోయిన్లతో నటించారు. ఇక మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా 33 వయసులో 72 ఏళ్ల రజనీకాంత్ సరసన నటించారు. దాదాపు తనకంటే డబుల్ వయసుకు మించి ఉన్న హీరో సరసన తమన్నా నటించింది. `జైలర్`లో రజనీతో కనిపించింది.
ఇప్పుడు `దబాంగ్` టూర్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి వేదికపై డ్యాన్సులు వేస్తున్న తమన్నా వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూశాక ఇద్దరి మధ్యా వయసు అంతరం గురించి చాలా గుసగుసలు మొదలయ్యాయి. సల్మాన్ భాయ్ వయసు 60.. తమన్నా వయసు 34. ఇంచుమించు సగం వయసు తేడా ఉంది. దబాంగ్ టూర్ లో తనకంటే వయసులో చాలా చిన్నవాళ్లు అయిన కథానాయికలతో సల్మాన్ భాయ్ స్టెప్పులేస్తున్నాడు. ఇది చూసి షష్ఠి పూర్తిలో ఈ వేషాలేమిటో! అంటూ సల్మాన్ భాయ్ ని నిలదీస్తున్నారు. సల్మాన్ వయసు అయిపోయింది.. అతడి డ్యాన్సుల్లో గ్రేస్ కనిపించడం లేదని కూడా కొందరు విమర్శిస్తున్నారు.
అయితే సల్మాన్ ఖాన్ 60వయసులో ఇప్పటికీ నటుడిగా బిజీగా ఉన్నాడు. మరోవైపు వ్యక్తిగతంగా అతడు ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. తన సహచరుడు అమీర్ ఖాన్ షష్ఠిపూర్తి వయసులో తనకు తోడు కావాలంటూ మూడో భార్యను తెచ్చుకున్నాడు. అతడితో పోలిస్తే సల్మాన్ భాయ్ ఇలాంటి తప్పు చేయడం లేదు. పెళ్లెప్పుడు? అని ప్రశ్నిస్తే, ఈ వయసులో నాకు పెళ్లేమిటి? అంటూ సల్మాన్ నిజాయితీగా దాట వేస్తున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ యుక్త వయసులో ఎప్పుడు పెళ్లాడాలనుకున్నా తన ప్రేయసితో ఏదో ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. తాంబూలం వరకూ వెళ్లినా రెండు సంబంధాలు ఆగిపోయిన విషయం తెలిసినదే.