బ్రేకప్ తో బిజీ ఇది వెరీ రేర్ గురూ!
మిల్కీ బ్యూటీ తమన్నా-విజయ్ వర్మ రిలేషన్ షిప్ ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు.;
మిల్కీ బ్యూటీ తమన్నా-విజయ్ వర్మ రిలేషన్ షిప్ ముగిసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సాధారణంగా బ్రేకప్ అయిందంటే? చాలా మంది సోషల్ మీడియా వేదికగా మనసులో భావాలను వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇద్దరు చేయకపోయినా ఒకరైనా అలాంటి ప్రయత్నం చేస్తారు. కానీ తమన్నా-విజయ్ విషయంలో ఎవరికి వారే సైలెంట్ గా ఉన్నారు.
ఇక్కడ కూడా? ఇరువురు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన బెడితే బ్రేకప్ తో తమన్నా ఒక్కసారిగా మళ్లీ బిజీ అయింది. రిలేషన్ షిప్ లో ఉన్నంత కాలం ఆడతా పాడుతూ పనిచేసిన అమ్మడు ఇప్పుడు మాత్రం క్షణం తీరిక లేకుండా అవకాశాలు అందుకుంటుంది. ఇటీవలే 'ఓదెల 2'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. 'రైడ్ 2'లో స్పెషల్ సాంగ్ తోనూ అలరించింది.
ప్రస్తుతం అజయ్ దేవగణ్ తో కలిసి 'రేంజర్' సినిమా చేస్తుంది. ఇది పాత కమిట్ మెంట్ అయినా ఈ మధ్యనే పట్టాలెక్కింది. తాజాగా అమ్మడు ఇలాకాలో మరో మూడు చిత్రాలు చేరాయి. జాన్ అబ్రహం హీరోగా యాక్షన్ సంచనలం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ తమన్నా ఎంపికైంది. అలాగే సిద్దార్ద్ మల్హోత్రాకి జోడీగా వివాన్ లోనూ నటిస్తోంది. మరో రెండు హిందీ చిత్రాలు చర్చలో దశలో ఉన్నాయి.
ఇవిగాక అమ్మడు టాలీవుడ్ లో కొత్త సినిమాలకు సంప్రదింపులు జరుపుతుంది. అటు కోలీవుడ్ లో కూడా ఉన్న పరిచయాలతో అవకాశాలు అందుకుంటుంది. ఇలా తమన్నా పెళ్లి కాకుండానే సెకెండ్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టిస్తుంది. పెళ్లైతే ఇంకా బిజీ అవుతుందేమో. ఎందుకంటే పెళ్లైన భామలకు డిమాండ్ ఎక్కువ కదా.