మహేష్ సోషల్ మీడియా.. తమన్నా అలా ప్లాన్ చేసిందేంటి?
ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన కామెంట్స్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
స్టార్ హీరోల వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరెంత యాక్టివ్ గా ఉంటారు.. ఎలాంటి పోస్టులు పెడతారనే విషయాలు తరచూ చర్చకు వస్తుంటాయి. అలాంటి సమయంలో ఇప్పుడు ఒక త్రో బ్యాక్ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన కామెంట్స్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కొన్నేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా నిర్వహించిన సామ్ జామ్ టాక్ షో మంచి ఆదరణ పొందింది. సినీ ప్రముఖులతో సరదాగా అన్ని విషయాలు మాట్లాడిన ఆ షోకు తమన్నా కూడా గెస్ట్ గా వచ్చారు. ఆ ఎపిసోడ్ లో సమంత అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపెన్ గానే సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఎవరైనా సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్ ను టేకోవర్ చేసుకునే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారని సమంత ప్రశ్నించారు.
దీనికి తమన్నా వెంటనే మహేష్ బాబు పేరు చెప్పారు. ఆయన ఎక్స్ అకౌంట్ ను టేకోవర్ చేయాలని అనుకుంటున్నానని చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు వ్యక్తిగత జీవితంలో చాలా ప్రైవేట్ గా ఉంటారని.. ఆయనతో దగ్గరగా పని చేసిన వారికి అది బాగా తెలుసని తమన్నా అన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా, క్యాండిడ్ గా పోస్టులు పెడుతుంటారని చెప్పారు. ముఖ్యంగా కుటుంబంతో గడిపిన క్షణాలు, ట్రావెల్ ఫోటోలు, త్రోబ్యాక్ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
అప్పట్లో చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఆ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. మహేష్ సోషల్ మీడియా స్టైల్ గురించి చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. సినిమా అప్డేట్స్ తోపాటు కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, పిల్లలతో గడిపే క్షణాలు, భార్య నమ్రతతో ట్రిప్స్ వంటి పోస్టులు ఆయన అకౌంట్లలో కనిపిస్తుంటాయి. అందుకే మహేష్ కు సోషల్ మీడియాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ బాబు, సమంత కాంబినేషన్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా దూకుడులో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ కథా నేపథ్యంతో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు మహేష్ బాబు, తమన్నా కలిసి ఆగడు సినిమాలో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఇద్దరి జోడీకి మంచి గుర్తింపు లభించింది.
సినిమాలోని భేల్పూరి పాట అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తమన్నా గ్లామర్, మహేష్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అదే సమయంలో సామ్ జామ్ షో విషయానికి వస్తే.. సమంత హోస్టింగ్ కు కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సెలబ్రిటీలతో ఫన్నీ కన్వర్జేషన్స్, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర ప్రశ్నలు షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందులో సమంత, తమన్నా కలిసి చేసిన సందడి ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయే ఎపిసోడ్స్ లో ఒకటి!