మిల్కీ బ్యూటీలో మెరుపు తగ్గిందే!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రెండు దశాబ్దాలుగా తన గ్లామర్ , నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తోంది.;
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా రెండు దశాబ్దాలుగా తన గ్లామర్ , నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తోంది. 15 ఏళ్ల ప్రాయంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు నేటికీ అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆమె తాజా వీడియోలు , ఫోటోలు చూస్తుంటే? కాలక్రమేణా ఆమె ముఖకవళికల్లో వస్తోన్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సహజంగానే ఎవరికైనా వయస్సు పెరుగుతున్న కొద్దీ శారీరక మార్పులు రావడం సహజం. తమన్నా విషయంలో కూడా ఇప్పుడు అదే జరుగుతోందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
పాలు గారే బుగ్గలతో కనిపించే తమన్నా ముఖంలో ఒకప్పటి మేనిమ ఛాయ మిస్ అయినట్లుంది. ముఖ్యంగా ఆమె కళ్ల కింద , దవడ భాగంలో వయస్సు ప్రభావం కొంత వరకు ప్రతిబింబిస్తోంది. ఇది తమన్నా సహజమైన అందానికి నిదర్శనమని కొందరు అంటుంటే? మరికొందరు ఆమె మునుపటి మెరుపు తగ్గిందని అభిప్రాయపడుతున్నారు. తమన్నా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథాబలం ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. వయస్సు పెరగడం అనేది ఒక నటిగా ఆమెకు మరింత లోతైన పాత్రలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రస్తుతం తమన్నా నటిస్తోన్న ఇరుముడి వంటి చిత్రాల్లో ఆమె లుక్ ఎంతో గంభీరంగా, పాత్రకు తగినట్లుగా ఉండబోతోంది. గ్లామర్ కంటే కూడా స్క్రీన్ ప్రెజెన్స్ , ఎమోషన్స్ పండించడంలో తమన్నా మరింత రాటుదేలే ప్రక్రియలో ఇలాంటి రూపంలో మార్పు చెందిందా? అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. సినీ పరిశ్రమలో హీరోయిన్ల వయస్సుపై చర్చ జరగడం కొత్తేమీ కాదు. కానీ తమన్నా వంటి సీనియర్ తారలు తమ వయస్సును హుందాగా స్వీకరిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడం అభినందనీయం. మేకప్ లేకుండా లేదా సహజమైన వెలుతురులో కనిపించినప్పుడు నటీనటులు కూడా సామాన్యుల్లాగే కనిపిస్తారని ఈ ఫోటోలు గుర్తు చేస్తున్నాయి.
కేవలం అందం మీదనే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి , ఫిట్‌నెస్ మీద ఆమె చూపిస్తున్న శ్రద్ధ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. మొత్తంగా తమన్నా ముఖంలో కనిపిస్తోన్న ఈ మార్పులు ఆమె కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఒక సంకేతం. రొటీన్ కమర్షియల్ సినిమాల నుండి బయటకు వచ్చి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు , విభిన్నమైన పాత్ర లతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. ముఖంలో మునుపటి టీనేజ్ మెరుపు లేకపోయినా? ఒక పరి పూర్ణమైన నటిగా ఆమె చూపుతున్న ప్రతిభే అమ్మడిని మరిన్ని ఏళ్ల పాటు ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు.