త‌మ‌న్నా చుట్టూ ముదురుతున్న వివాదం

హీరోయిన్‌గా క్రేజ్ త‌గ్గిపోవ‌డంతో త‌మ‌న్నా ఇప్పుడు ప్ర‌త్యేక ఐట‌మ్ నంబ‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. సినిమాల కంటే వీటి ద్వారానే భారీగా అందుతుండ‌టంతో మిల్కీ బ్యూటీ గ‌త కొంత కాలంగా వీటికే ప‌రిమిత‌మ‌వుతూ వ‌స్తోంది.;

Update: 2025-05-24 12:01 GMT

హీరోయిన్‌గా క్రేజ్ త‌గ్గిపోవ‌డంతో త‌మ‌న్నా ఇప్పుడు ప్ర‌త్యేక ఐట‌మ్ నంబ‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. సినిమాల కంటే వీటి ద్వారానే భారీగా అందుతుండ‌టంతో మిల్కీ బ్యూటీ గ‌త కొంత కాలంగా వీటికే ప‌రిమిత‌మ‌వుతూ వ‌స్తోంది. క్రేజీ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద ఓటీటీల్లోనూ మెరుస్తూ వైర‌ల్ అవుతున్న త‌మ‌న్నా చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం మొద‌లైంది.

దీని కార‌ణంగా త‌ను అందుకున్న భారీ మొత్తాన్నితిరిగి చెల్లించాల‌నే భ‌యం త‌న‌ని ఇప్పుడు వెంటాడుతోంది. వివ‌రాల్లోకి వెళితే..క‌న్న‌డ నాట పాపుల‌ర్ అయిన సోప్ మైసూర్ సాండ‌ల్‌. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా క‌స్ట‌మ‌ర్ల న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకుని ద‌క్షిణాది రాష్ట్రాల్లో అత్య‌ధికంగా సేల్ అవుతోంది. దీన్ని ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తోంది. ప్ర‌భుత్వ ఆధీనంలో గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా సాఫీగా సాగుతున్న మైసూర్ సాండ‌ల్ అమ్మాకాల‌ని ఉత్త‌రాదిలోనూ పెంచాల‌ని, ఈ సోప్‌ను ఉత్త‌రాది వారికి కూడా చేరువ చేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకుంది.

అందులో భాగంగానే మైసూర్ సాండ‌ల్‌ను ఉత్త‌రాదిలో ప్ర‌మోట్ చేయ‌డం కోసం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని ఎంచుకుంది. ఇందు కోసం త‌న‌కు రూ.6.20 కోట్ల‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే ఇప్పుడు క‌న్న‌డ నాట ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. దీనిపై వివిధ పార్టీల వారు, ప్ర‌జా సంఘాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ త‌మ‌న్నాని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా తొల‌గించాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి.

కానీ త‌మ‌న్నా మాత్రం పెద్ద డీల్ కావ‌డంతో ఇది చేజారి పోతే ఎలా అని మఫీల‌వుతోంద‌ట‌. కానీ క‌న్న‌డ సంఘాలు మాత్రం త‌మ‌న్నాని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎట్టిప‌రిస్థితుల్లో అంగీక‌రించేది లేద‌ని ఫైట్ చేస్తున్నారు. అక్క‌డ లోక‌ల్ పీలింగ్ పీక్స్‌కు చేర‌డం వ‌ల్లే త‌మ‌న్నాని త‌ప్పించాల‌ని కోరుతున్న‌ట్టుగా తెలుస్తోంది. రెండు మూడు సినిమాల‌కు వ‌చ్చే డ‌బ్బు ఈ ఒక్క డీల్‌కే వ‌స్తుండ‌టంతో ఎక్క‌డ డీల్ క్యాన్సిల్ అవుతుందోన‌ని త‌మ‌న్నా టెన్ష‌న్ ప‌డుతోంద‌ట‌.

Tags:    

Similar News