ఫోటో స్టోరి: వ్వావ్ త‌మ‌న్నా..!

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ జ‌ర్నీ, ల‌వ్ స్టోరి గురించి తెలిసిందే. టాలీవుడ్ -కోలీవుడ్‌- బాలీవుడ్ లో ఈ భామ చాలా కాలంగా మూడు ముక్క‌లాట ఆడుతోంది.;

Update: 2025-07-28 04:19 GMT

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ జ‌ర్నీ, ల‌వ్ స్టోరి గురించి తెలిసిందే. టాలీవుడ్ -కోలీవుడ్‌- బాలీవుడ్ లో ఈ భామ చాలా కాలంగా మూడు ముక్క‌లాట ఆడుతోంది. పెద్ద స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు ద‌క్క‌క‌పోయినా, తెలివిగా లాంగ్ ర‌న్ ని కొన‌సాగిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోను త‌మన్నా స్పీడ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన‌ర్ లెహంగాలో ఈ బ్యూటీ త‌ళుక్కున మెరిసింది. మిల్కీ బ్యూటీ అందాల‌కు వ్వావ్! అంటూ అభిమానులు థ‌మ్స‌ప్ ఇస్తున్నారు.

మ‌నీష్ జీ డిజైన‌ర్ దుస్తుల్లో గ్లాం అవ‌తార్ ఒక గొప్ప అనుభూతి అని మిల్కీ బ్యూటీ ఆనందం వ్య‌క్తం చేసింది. ఆ కోచర్ పార్టీ ప్ర‌త్యేక‌మైన‌ది... ఎంత అద్భుతమైన రాత్రి.. INAYA అనేది స్వచ్ఛమైన కవిత్వం.. మీలాగా ఎవరూ గ్లామర‌స్‌గా మార్చ‌లేరు! అంటూ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రాను ప్ర‌శంసించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. తమన్నా భాటియా సూపర్ నేచురల్ థ్రిల్లర్ `ఓదెలా 2`లో కనిపించింది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హెబా పటేల్ కూడా మ‌రో క‌థానాయిక‌. అజయ్ దేవ్‌గన్ `రైడ్ 2`లో నాషా అనే ప్రత్యేక పాటలో న‌ర్తించింది. `డేరింగ్ పార్టనర్స్` అనే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో డయానా పెంటీతో కలిసి తమన్నా కనిపించనుంది. ఈ సిరీస్‌లో జావేద్ జాఫెరి - నకుల్ మెహతా త‌దిత‌రులు నటించారు. ఈ సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించ‌లేదు. అజయ్ దేవగన్ - సంజయ్ దత్ లతో పాటు అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ `రేంజర్`లో తమన్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఫారెస్ట్ రేంజర్ గా - సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 లో విడుదల కానుంది.

Tags:    

Similar News