విజయ్ ప్రేమలో నిజాయితీ లేదా? ఓపెనైన తమన్నా!
నటుడు విజయ్ వర్మతో లవ్ బ్రేకప్ తర్వాత తమన్నా ఆలోచనల్లో తీవ్ర మార్పులొచ్చాయి.;
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా కెరీర్ జర్నీ, లవ్ లైఫ్ గురించి తెలిసిందే. ఓవైపు సౌత్ లో నటిస్తూనే, బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లలో నటిస్తూ, తనలోని వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
అయితే తమన్నా వ్యక్తిగత లవ్ లైఫ్ లోని కుదుపు తనను నిజంగా భావోద్వేగానికి గురి చేస్తోంది. నటుడు విజయ్ వర్మతో లవ్ బ్రేకప్ తర్వాత తమన్నా ఆలోచనల్లో తీవ్ర మార్పులొచ్చాయి. అయితే బ్రేకప్ తర్వాతా విజయ్ తో స్నేహం కొనసాగిస్తున్నానని చెప్పిన తమన్నా, ఇప్పుడు అనూహ్యమైన కామెంట్ చేయడం చర్చగా మారింది.
తమన్నా తాజా చాటింగ్ సెషన్ లో `నిజాయితీ` గురించి ఎక్కువగా మాట్లాడింది. నిజాయితీ అనేది అద్దం లాంటిది.. అద్దం బ్రేక్ అయితే అంటించవచ్చు కానీ, అది ఎప్పుడూ ఒకేలా కనిపించదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది తమన్నా. సూటిగా తన మాజీ ప్రియుడి పేరును ప్రస్థావించకుండా వ్యాఖ్యానించినా కానీ, ఆ టైమింగ్ రైమింగ్ కచ్ఛితంగా తన మాజీ గురించేనని అర్థమవుతోంది. ఎవరైనా హత్య చేస్తే.. నేను ఇంకా సహాయం చేయగలను. కానీ ఎవరైనా అబద్ధం చెబితే..అస్సలు తట్టుకోలేను! అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ సూటి విమర్శ ఎవరిని ఉద్ధేశించి? తమన్నా ఎవరిని టార్గెట్ చేసింది?.. అర్థం చేసుకునేవారికి చేసుకున్నంత. రిలేషన్ షిప్స్ లో ఆనందం కంటే నిజం చాలా ముఖ్యం. ముఖ్యంగా గ్లామర్ రంగంలో కొన్ని నిజాలను డైజెస్ట్ చేసుకోవడం ఎప్పటికీ అంత సులువు కాదు. చాలా మంది కథానాయికలు అలాంటి కొన్ని కఠిన విషయాలను ఇక్కడ ఎదుర్కోవడం చూస్తున్నదే.