తాప్సీ యూటర్న్.. మళ్లీ తెలుగులో నటిస్తుందా?

ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన ఆమె తాజా చిత్రం అస్సీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అందుకోలేదు.;

Update: 2026-02-27 09:10 GMT

ఒకప్పుడు టాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ తాప్సీ పన్ను ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో టాలీవుడ్ దర్శకులు తనకు ఇష్టం లేని దుస్తులు వేయించేవారని, గ్లామర్‌ ను బలవంతంగా చూపించేవారని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా సౌత్ సినిమాలు నాభి అందాలు ఎక్కువగా చూపిస్తాయని చేసిన కామెంట్స్ అభిమానులను అసహనానికి గురి చేశాయి. ఆ వ్యాఖ్యలతో తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఆమెపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెరీర్ ప్రారంభించిన పరిశ్రమ గురించి ఇలా మాట్లాడటం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే తాజాగా ఆమె యూటర్న్ తీసుకోవడం గమనార్హం.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, "నాకు నటిగా మొదటి అవకాశాలు ఇచ్చింది తెలుగు సినిమా. ఇక్కడే నేను ఎక్కువగా నేర్చుకున్నాను. విభిన్న పాత్రలు చేసే అవకాశం కూడా టాలీవుడ్ వల్ల వచ్చింది. నా కెరీర్‌ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ తెలుగు ఇండస్ట్రీనే" అని చెప్పింది. అంతేకాదు, ఇతర ఇండస్ట్రీల్లో లభించని అభిమానాన్ని కూడా తెలుగులోనే పొందానని పేర్కొంది.

ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన ఆమె తాజా చిత్రం అస్సీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అందుకోలేదు. దీంతో ఆమె కెరీర్‌ పై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆమె తన గత వ్యాఖ్యలను మార్చుకుంటా టాలీవుడ్‌ పై ప్రశంసలు కురిపించడం వెనుక అదే కారణమా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ పై నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు.

నటీనటులు ఎక్కడి నుంచి అవకాశాలు వచ్చాయో గుర్తుంచుకోవడం అవసరమని, కెరీర్ స్టార్టింగ్ లో సహకరించిన ఇండస్ట్రీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే అభిమానుల్లో దూరం పెరుగుతుందని అంటున్నారు. అదే సమయంలో తప్పు సరిదిద్దుకోవడం మంచిదే అని చెబుతున్నారు. మరోవైపు, తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమె మాటల్లో నిజాయితీ ఉందా? లేక జస్ట్ కామెంట్స్ ను ఛేంజ్ చేశారా? అని అడుగుతున్నారు.

ఏదేమైనా టాలీవుడ్ ఆమెకు మంచి గుర్తింపు ఇవ్వడం మాత్రం నిజమేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు మూవీ ఝుమ్మంది నాదంతో హీరోయిన్‌ గా పరిచయమైన ఆమె.. చివరిగా 2022లో వచ్చిన మిషన్‌ ఇంపాజిబుల్‌ లో యాక్ట్ చేశారు. అయితే ఒకప్పుడు విమర్శలు చేసి ఇప్పుడు ప్రశంసలు కురిపించిన తాప్సీ.. ఫ్యూచర్ లో మళ్లీ తెలుగు సినిమాల్లో నటిస్తారా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News