కోట్లు కూడబెట్టి పిల్లల్ని నాశనం చేయకండి!
తల్లిదండ్రులంతా పిల్లలు తమలా కష్టపడకూడదని ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇస్తారు. తమలా తమ పిల్లలు జీవితాలు ఉండకూడదని ఉన్నతంగా జీవించాలని ఆశపడతారు.;
తల్లిదండ్రులంతా పిల్లలు తమలా కష్టపడకూడదని ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇస్తారు. తమలా తమ పిల్లలు జీవితాలు ఉండకూడదని ఉన్నతంగా జీవించాలని ఆశపడతారు. అలా ఆశించడంలో తప్పులేదు. కానీ అదే డబ్బుతో పిల్లలు వ్యసనాలకు బానిసలవ్వడం...డబ్బు ఉంది అనే అహంతో చోటు చేసుకుంటోన్న సంఘటనలు అప్పడప్పుడు వార్తల్లో చూస్తుంటాం. అందుకే పిల్లలకు కష్టాలు తెలియాలని పూరి జగన్నాధ్ లాంటి డైరెక్టర్ అప్పుడప్పుడు క్లాస్ పీకుతుంటాడు. కష్టం తెలిసినప్పుడు సంపద విలువ తెలుస్తుందని..డబ్బుతో తస్మాత్ జాగ్రత్తగా ఉంటారన్నది ఆయన అభిప్రాయం.
తాను కోట్ల రూపాయలు సంపాదించినా తన పిల్లల్ని మాత్రం హాస్టల్స్ లో పెట్టి చదివించాడు. కష్ట విలువ తెలిసేలా చేసాడు. పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు..ఎదిగే సామర్ధ్యం...విలువలతో కూడిన జీవితం అంటారు. తాజాగా మలయాళ నటి మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ అధ్యక్షురాలు శ్వేతామీనన్ కూడా అలాగే స్పందించారు. పిల్లల కోసం డబ్బులు దాచి పెడుతూ తల్లిదండ్రలు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇలా చేయడం అతి పెద్ద తప్పుగా భావించారు. తల్లిదండ్రులగా వారు గొప్పగా జీవించడం మొదలు పెడితే పిల్లలు వారిని చూసి వారు ఎలా బ్రతాకాలో నేర్చుకుంటారంది.
పిల్లలకు అన్ని అందించడం అంటే వాళ్లను శిక్షిస్తున్నట్లే అన్నారు. పిల్లలకు కావాల్సింది కోట్లు కాదు. ప్రేమ మంచి జ్ఞాపకాలు. తల్లిదండ్రులగా పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యం మాత్రమే అందించాలన్నారు. వాళ్లని నచ్చిన రంగం వైపు వెళ్లేలా ప్రోత్సహించాలన్నారు. అది వారి జీవితానికి ఉపయోగపడేది అయి ఉండాలన్నారు. తన కుమార్తె విషయంలో తాను అలాగే వ్యవహరిస్తునన్నారు. `నా సంపాదన చూసి అదంతా నాదే అని నా కూతురు భావిస్తుంది. కానీ అది నీది కాదు..నాది అని గట్టిగా చెప్పి వాస్తవ జీవితం ఎలా ఉంటుందన్నది గుర్తు చేస్తానంది.
కోట్లు సంపాదించి పిల్లలకు ఇస్తే అది వారి జీవితాలను తీయడానికే ఉపయోగపడుతుందన్నారు. ఎవరి సంపాదన వారిదన్నట్లు ఉంటేనే? కష్టం విలువ తెలుస్తుందన్నారు.` వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూస్తానన్నారు. ఇంటికొచ్చిన తర్వాత ఇంటి విషయాలు తప్ప ఇంకేమి ఆలోచించను. నాకు అవార్డులు వచ్చినా వాటిన భద్రంగా దాచేస్తాను. వాటి గురించి ఇంట్లో వారు అడిగితే తప్ప వాటి గురించి చెప్పను. ఇంట్లో నటిగా కాకుండా భార్యగా, తల్లిగా మాత్రమే ఉంటాన`న్నారు.