రామ్ చరణ్ మూవీనే రిజెక్ట్ చేసిన తమ్ముడు బ్యూటీ.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందే!

ఇక శ్వాసిక విషయానికి వస్తే.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తురాలే. ఇటీవల జూలైలో విడుదలైన నితిన్ 'తమ్ముడు' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో అందరిని ఆకట్టుకుంది.;

Update: 2025-08-25 01:30 GMT

సాధారణంగా ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు.. ఎలాంటి పాత్ర అయితే చేస్తారో.. ఆ తర్వాత సినిమాలలో కూడా దాదాపు అవే పాత్రలు లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలా తప్పని పరిస్థితుల్లో ఒక పాత్ర చేసి.. ఆ తర్వాత ఎందుకు చేశాంరా అనే బాధపడే సెలబ్రిటీలు కూడా లేకపోలేదు.ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఏదో ఒక పాత్ర చేసి.. ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తుండడంతో రియలైజ్ అయ్యి.. ఇప్పుడు బంగారం లాంటి ఛాన్స్ లను మిస్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా రాంచరణ్ తో నటించే అవకాశాన్ని చేజేతులారా కాదనుకుంది తమ్ముడు మూవీ నటి. మరి ఆమె ఎవరు? రామ్ చరణ్ మూవీను ఎందుకు రిజెక్ట్ చేసింది ? అది ఏ మూవీ? గతంలో ఆమె చేసిన పాత్రలేంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

రామ్ చరణ్ మూవీ రిజెక్ట్ చేసిన శ్వాసిక..

ఆమె ఎవరో కాదు 33 ఏళ్ల మలయాళ నటి శ్వాసిక. ఇటీవల 'లబ్బర్ పందు' సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించి అలరించింది. ఈ సినిమాతో తన అద్భుతమైన నటన కనబరిచి.. అందరి దృష్టిని ఆకర్షించిన ఈమెకు.. చాలామంది దర్శక నిర్మాతలు ఇలా మదర్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారని.. తల్లిగా నటించే ఆసక్తి లేక ఇప్పుడు రాంచరణ్ పెద్ది సినిమాని కూడా రిజెక్ట్ చేశానని శ్వాసిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అందుకే వద్దనుకున్నాను అంటూ క్లారిటీ..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వాసిక మాట్లాడుతూ.." నేను గతంలో తల్లి పాత్ర చేయడం వల్ల ఇప్పుడు ఏకంగా పెద్ది సినిమాలో కూడా హీరోకి తల్లిగా నటించే అవకాశం వచ్చింది. ఒకవేళ నేను ఈ సినిమాలో రామ్ చరణ్ కి తల్లిగా నటిస్తే.. నా కెరియర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు.. కానీ అలాంటి రోల్స్ చేయాలని ప్రస్తుతం అనుకోవడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశమే వస్తే. మళ్ళీ ఆలోచిస్తాను" అంటూ తెలిపింది. మొత్తానికి అయితే మదర్ రోల్స్ ఇప్పుడు చేయడం ఇష్టం లేకే.. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

శ్వాసిక కెరియర్..

ఇక శ్వాసిక విషయానికి వస్తే.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తురాలే. ఇటీవల జూలైలో విడుదలైన నితిన్ 'తమ్ముడు' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో అందరిని ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న ఈమెకు.. ఇప్పుడు ఇలాంటి ఆఫర్లు లభిస్తుండడంతో వాటిని పక్కన పెడుతున్నట్లు సమాచారం.

పెద్ది సినిమా విశేషాలు..

రామ్ చరణ్ పెద్ది సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈయన గతంలో 'ఉప్పెన' సినిమా చేసి మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ చవి చూసిన విషయం తెలిసిందే. క్రీడా నేపథ్య కథతో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది . రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News