మాజీ సీఎం భార్యపై 'క్రష్' వ్యాఖ్య... చీవాట్లకు నటి స్పందన!
ప్రముఖ రాజకీయ నాయకుడు, యుపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ పై బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ 'క్రష్' కామెంట్ ప్రకంపనాలు రేపిన సంగతి తెలిసిందే.;
ప్రముఖ రాజకీయ నాయకుడు, యుపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ పై బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ 'క్రష్' కామెంట్ ప్రకంపనాలు రేపిన సంగతి తెలిసిందే. నెటిజనులు స్వరా కామెంట్ ను తప్పు పట్టారు. తాజా ఇంటర్వ్యూలో దీనికి స్వరా వివరణ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ద్విలింగ సంపర్కం (బైసెక్సువల్) గురించి మాట్లాడాను. నేను అనుకున్నది స్వేచ్ఛగా మాట్లాడాను. ఇందులో తప్పే ఉంది? నాకు పెళ్లయింది.. ఒక బిడ్డ ఉంది. డింపుల్ యాదవ్ విషయానికి వస్తే ఆమె అందంగా ఉంటుంది. చాలా మందికి స్ఫూర్తి. ఆమె రాజకీయ నాయకుడి భార్య. తను కూడా రాజకీయాల్లో ఉంది. తనను నేను ఆరాధిస్తాను. స్ఫూర్తిగా తీసుకుంటాను.. ఆ కోణంలో మాత్రమే మాట్లాడాను. అందులో తప్పేం లేదు.. కానీ ఆ కామెంట్ ఎందుకు వైరలైందో నాకు తెలీదు.. అని స్వరా వివరణ ఇచ్చారు.
అసలు స్వరా కామెంట్ ఏమిటీ?
''అసలు ఈ ప్రజలకు స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఇస్తే, వారంతా ద్విలింగ సంపర్కులుగా ఉంటారు. అబ్బాయి- అమ్మాయి శృంగార సంబంధం అనే ఆలోచనను మన పూర్వీకులు వేల సంవత్సరాలుగా మనపై రుద్దారు. ఇది ఒక సాధారణ నియమం అని మనకు పదే పదే చెప్పారు!'' అని కామెంట్ చేసారు బాలీవుడ్ నటి స్వరాభాస్కర్. సంఘంలోని ద్విలింగ సంపర్కులను తాను సమర్థిస్తానని అన్నారు. భిన్న లింగం మానవ జాతి పునరుద్ధరణకు సహకరిస్తుందని అందుకే దీనిని ఒక సాధారణ నియమంగా మార్చారని స్వర భాస్కర్ పేర్కొన్నారు.
రాజకీయ జీవితం ప్రభావితం అవుతుంది:
అదే ఇంటర్వ్యూలో రాజకీయ నాయకుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పై తన క్రష్ గురించి స్వరా ప్రస్థావించడం వివాదాస్పదమైంది. ఆమె తన `లవ్` అని స్వరా పేర్కొనడం ప్రకంపనాలు రేపింది. ఈ కామెంట్ కారణంగా యుపిలో తన భర్త రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ ఆవేదన చెందారు. ద్విలింగ సంపర్కం తప్పు కాదని చెప్పిన స్వరా మరో మహిళపై క్రష్ ఉందని వ్యాఖ్యానించడం కంగారు పెట్టింది.
ఆమెకు బ్రెయిన్ వాష్ అయింది:
స్వరా వ్యాఖ్యలపై నెటిజనులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పురుషులను ద్విలింగ సంపర్కులుగా చూస్తోందని, ఆమెకు బ్రెయిన్ వాష్ అయిందని చీవాట్లు పెట్టారు. స్వరా మూర్ఖంగా మారిందని విమర్శించారు. ఆడ- మగ సంపర్కం కేవలం కొత్త తరాన్ని పెంచి పోషించడం కోసమేనా? మగాళ్లను ద్విలింగ సంపర్కులు అంటుందా? అంటూ చాలా మంది ధుమధుమలాడారు.
గేలకు బై సెక్సువల్ కి తేడా?
ద్విలింగ సంపర్కం (బై సెక్సువల్) అంటే.. ఒక వ్యక్తి ఆడ లేదా మగ ఎవరితో అయినా శృంగారం చేయడం.. `గే` అంటే మగ -మగ శృంగారం, లెస్బియన్ అంటే ఆడ- ఆడ శృంగారం.
రియాలిటీ షోలతో బిజీ..
స్వరా భాస్కర్ ప్రస్తుతం టీవీ రియాలిటీ షోలతో బిజీగా ఉన్నారు. తన భర్త, రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్‌తో కలిసి `పతి పత్ని ఔర్ పంగా` అనే రియాలిటీ షోతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది స్వరా. సోనాలి బింద్రే, మునావర్ ఫరూఖీ హోస్టింగ్ చేస్తున్న ఈ షో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.