మూడో సీజన్ కు రెడీ అవుతున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్
అయితే ఇప్పటికే సుజల్ నుంచి రెండు సీజన్లు రిలీజవగా, సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్‌ల్లో దీనికి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది.;
భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ఆడియన్స్ ను ఎన్నో వెబ్‌సిరీస్‌లు విశేషంగా అలరిస్తున్నాయి. అలా 2022లో వచ్చిన తమిళ వెబ్‌సిరీసే సుజల్: ది వొర్టెక్స్. కాథిర్, ఐశ్వర్యా రాజేష్, ఆర్. పార్తిబన్, హరీష్ ఉత్తమన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌గా వచ్చిన దీన్ని పుష్కర్- గాయత్రి కలిసి సృష్టించారు.
మొదటి రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్
అయితే ఇప్పటికే సుజల్ నుంచి రెండు సీజన్లు రిలీజవగా, సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్‌ల్లో దీనికి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. మొదటి రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ రిలీజైన రెండు సీజన్లకు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లో మంచి వ్యూస్ తో పాటూ ఆదరణ కూడా సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
సుజల్ మూడో సీజన్ పై వర్క్ చేస్తున్న మేకర్స్
నిర్మాతలు ఈ వెబ్ సిరీస్ యొక్క మూడో సీజన్ పై వర్క్ చేస్తున్నారని, దానికి సంబంధించిన షూటింగ్ 2026 ఆగస్ట్ నుంచి మొదలవుతుందని చెప్తున్నారు. కాగా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుజల్: ది వోర్టెక్స్ మొదటి రెండు సీజన్లకు బ్రహ్మ జి, అనుచరణ్ మురుగయ్యన్, సర్జున్ దర్శకత్వం వహించగా, వాల్ వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది.
తమిళంతో పాటూ 30 భాషల్లో రిలీజైన ఈ సిరీస్ మంచి సక్సెస్ ను అందుకోవడంతో పాటూ ఎన్నో ఓటీటీ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం అందించిన ఈ సిరీస్ తమిళంతో పాటూ తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాగా, ఈ సిరీస్ కు పుష్కర్- గాయత్రి అందించిన స్క్రీన్ ప్లే మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. సిరీస్ లోని ట్విస్టులు ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తాయి.