కొడుకు ఎంట్రీ, హృతిక్‌తో బంధం, ప్రేమికుడితో లైఫ్!
చిన్న వయసు నుంచే గిటార్ వాయించడం, స్వయంగా పాటలు రాయడం వంటి సృజనాత్మక పనులపై హ్రేహాన్ ఆసక్తి కన బరుస్తున్నాడని వెల్లడించారు.
బాలీవుడ్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్.. స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సేన్ ఖాన్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం.. పిల్లల భవిష్యత్తు .. రిలేషన్షిప్లకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విడాకుల తర్వాత కూడా హృతిక్ రోషన్‌తో ఎలా స్నేహపూర్వక బంధాన్ని కొనసా గిస్తున్నారో వివరించారు. అలాగే కుమారుడి కెరీర్ ప్రణాళికలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సుస్సేన్ ఖాన్ పెద్ద కుమారుడు హ్రేహాన్ రోషన్ మ్యూజికల్ జర్నీ పట్ల ఎంతో గర్వంగా ఉన్నట్లు తెలిపారు.
చిన్న వయసు నుంచే గిటార్ వాయించడం, స్వయంగా పాటలు రాయడం వంటి సృజనాత్మక పనులపై హ్రేహాన్ ఆసక్తి కనబరుస్తున్నాడని వెల్లడించారు. ఇప్పటికే `హెవెన్లీ ప్లేస్` తర్వాత తాజాగా `ఎవ్రీ లిటిల్ థింగ్` సింగిల్‌ను విడుదల చేసిన హ్రేహాన్ ప్రతి నెలా ఓ కొత్త సింగిల్‌ను విడుదల చేసే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. అయితే తండ్రి హృతిక్ రోషన్ బాటలో హ్రేహాన్ కూడా భవిష్యత్తులో నటుడిగా ఎంట్రీ ఇస్తాడా అనే ప్రశ్నపై సుస్సేన్ స్పందిస్తూ ప్రస్తుతానికి అతనికి నటనపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
పూర్తిగా సంగీత రంగంపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాడని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము కానీ ప్రస్తుతం మాత్రం మ్యూజిక్‌ను మాత్రమే ఆస్వాదిస్తున్నాడని పేర్కొన్నారు. తామంతా అతని నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ నటుడు అర్సలాన్ గోనితో బంధం గురించి స్పష్టంగా మాట్లాడారు. తన జీవితంలో అర్సలాన్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. సరైన సమయంలో ఒకరికొకరు తోడుగా నిలిచామని సుస్సేన్ తెలిపారు. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా? తామిద్దరం ఒకరికొకరు అండగా ఉంటామనే బలమైన నమ్మకంతో ముందుకు సాగుతున్నట్లు భావోద్వేగంతో పంచుకున్నారు.
మరోవైపు మాజీ భర్త హృతిక్ రోషన్‌తో ఇప్పటికీ మంచి బంధం కొనసాగుతోందని తెలిపారు. తామిద్దరం పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి సమన్వయంతో ఉంటున్నామన్నారు. అలాగే హృతిక్ రోషన్ ప్రస్తుత భాగస్వామి సబా ఆజాద్ గురించి కూడా ప్రస్తావించారు. ఆమె ఎంతో అద్భుతమైన వ్యక్తి అని హృతిక్ అలాంటి మంచి భాగస్వామిని పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ కుటుంబాలన్నీ సంతోషంగా.. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయని తెలిపారు.
వయసు ఒక సంఖ్య మాత్రమేనని జీవితాన్ని తనదైన శైలిలో.. తనకు నచ్చినట్లుగా గడుపుతున్నానని సుస్సేన్ ఖాన్ స్పష్టం చేశారు. పిల్లల సంరక్షణ, సొంత వ్యాపారాలు , వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.