సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదర్శ కుటుంబం.. రన్ టైమ్ లాక్!
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదర్శ కుటుంబం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
వరుస సినిమాలతో విజయ పరంపర కొనసాగిస్తున్న వెంకటేష్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. ' హౌస్ నెంబర్ 47' అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ప్రీ ప్రొడక్షన్ పనుల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడిన ఈ సినిమా రెండు, మూడు వాయిదాల తర్వాత ఎట్టకేలకు అక్టోబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నారా రోహిత్, నివేదా పేతురాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది. మరి సెన్సార్ రిపోర్ట్ ఏమిటి? నిడివి ఎంత? అసలు ఈ సినిమాని ఎవరు చూడాలి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదర్శ కుటుంబం..
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆదర్శ కుటుంబం చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 16 సంవత్సరాల పైబడిన పిల్లలు, పెద్దలు ఈ సినిమాను చూడవచ్చు. ముఖ్యంగా పెద్దల సమక్షంలో పిల్లలు ఈ సినిమాను చూడవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి 2 గంటల 29 నిమిషాల నిడివి లాక్ చేశారు.
ఆదర్శ కుటుంబం పై సెన్సార్ రిపోర్ట్..
సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సభ్యులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మొదటి భాగం బాగుందని, రెండవ భాగం కొంత స్లోగా ఉన్నప్పటికీ పర్వాలేదనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా సినిమా బాగుందని కూడా చెబుతున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ , యాక్షన్ మేళవింపుగా సినిమా సాగుతుందని, అక్కడక్కడ యాక్షన్ ఉంటుందని, ఈ సినిమాతో త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ మంచి హిట్టు అందుకుంటుందని కూడా చెబుతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే అక్టోబర్ 30 వరకు ఎదురు చూడాల్సిందే.
వెంకటేష్ తదుపరి చిత్రాలు..
వెంకటేష్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఆయన మరోసారి టాలీవుడ్లో హిట్ మెషిన్ గా పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి తో జతకట్టారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా హీరోగా నటిస్తుండడం గమనార్హం. అలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలయికలో వస్తున్న చిత్రం జనవరి 12న విడుదల. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.