34B సంభాషణపై కీర్తి సురేష్ - రాధిక వివరణ: వైరల్ మీమ్స్‌కి చెక్
సినిమా సెట్స్‌పై సాంకేతికంగా వాడే సాధారణ సీన్ నంబర్ల సంభాషణను సోషల్ మీడియా వేదికగా ఇలా నెటిజన్లు మీమ్‌గా మార్చడం గమనార్హం.
అందాల నటి కీర్తి సురేష్ - సీనియర్ నటి రాధికా మధ్య ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ సందర్భంగా వీరిద్దరూ షూటింగ్ అనుభవాలను షేర్ చేసుకుంటూ `34B` గురించి మాట్లాడుకున్నారు. సినిమా లేదా సిరీస్ నిర్మాణ ప్రక్రియలో భాగమైన సీన్ నంబర్ లేదా సాంకేతిక విషయాల్లో ఒకరి నుంచి మరొకరు నేర్చుకున్న అంశాలేనని కొందరు చర్చించుకున్నారు.
అయితే ఇంటర్వ్యూలో వారు ప్రస్తావించిన `34B` అనేది నిజానికి స్క్రిప్ట్‌లోని ఒక నిర్దిష్టమైన సీన్ నంబర్ అని భావించినా కానీ.. అది కానే కాదు..అంటూ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. సోషల్ మీడియాల్లో నెటిజన్లు (ముఖ్యంగా తెలుగు ట్విట్టర్ X యూజర్లు) ఈ వీడియో క్లిప్‌ను భిన్నమైన కోణంలో వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. పూర్తి సంభాషణను కాకుండా.. కేవలం `34B` అని మాట్లాడిన కొన్ని సెకన్ల విజువల్స్‌ను మాత్రమే కట్ చేసి... దానికి డబుల్ మీనింగ్ లేదా హాస్యభరితమైన కాప్షన్లు జోడించి మీమ్స్‌గా మార్చారు. దీంతో ఈ క్లిప్‌లు అంతర్జాలంలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి.
సినిమా సెట్స్‌పై సాంకేతికంగా వాడే సాధారణ సీన్ నంబర్ల సంభాషణను సోషల్ మీడియా వేదికగా ఇలా నెటిజన్లు మీమ్‌గా మార్చడం గమనార్హం. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడారనే స్పష్టత ఉన్నా కానీ.. నెటిజన్లు ఈ సరదా క్లిప్‌లను వైరల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కీర్తి సురేష్ - నటి రాధికల మధ్య ఉన్న చక్కని అనుబంధం -ప్రొఫెషనలిజం ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి వ్యక్తమైంది.
అసలు విషయం ఇదీ:
కీర్తి, రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన డార్క్ క్రైమ్ కామెడీ చిత్రం `రివాల్వర్ రీటా`కు సంబంధించిన సంభాషణ ఇది. ఇది చాలా కాలంగా ట్రెండింగులో ఉంది. కథాంశం ప్రకారం ఒక అమాయకమైన అమ్మాయి అనుకోకుండా గ్యాంగ్స్టర్ల గొడవల్లో ఇరుక్కుని రివాల్వర్ పట్టుకోవాల్సి వచ్చే పరిస్థితుల్లో ఈ సిట్యువేషనల్ కామెడీ డైలాగ్ వస్తుంది. సాధారణంగా `మహానటి` వంటి క్లాసిక్, హోమ్లీ పాత్రలతో అలరించిన కీర్తి సురేష్ నోట ఈ డైలాగ్ రావడంతో మీమర్స్ హంగామా మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలపై ఈ ఆడియోతో క్రేజీ రీల్స్, ఫన్నీ కొలేజ్ మీమ్స్ ట్రెండ్ చేస్తూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.
ఈ డైలాగ్ చుట్టూ జరుగుతున్న చర్చపై ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ - రాధిక సరదాగా స్పందిస్తూ అవి సీన్ నంబర్లు అని వ్యాఖ్యానించారు. ఈ డైలాగ్ కేవలం సినిమాలోని కామెడీ టైమింగ్ కోసమే రాసినా కానీ అది సీన్ నంబర్ మాత్రమేనని.. ప్రేక్షకులు దీన్ని ఓన్ చేసుకుని ఇన్ని మీమ్స్ క్రియేట్ చేస్తారని అనుకోలేదని కీర్తి నవ్వుతూ వెల్లడించారు. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కూడా సపోర్ట్‌గా నిలుస్తూ.. ఇది ఒక సరికొత్త డార్క్ కామెడీ జోనర్ అని... ఇలాంటి బోల్డ్ - ఫన్నీ పాత్రలను కీర్తి ఎంతో ఈజ్ తో చేసిందని కొనియాడారు. సినిమాల్లోని సిట్యువేషనల్ కామెడీని వినోదంగానే చూడాలని.. ఈ మీమ్స్ అన్నీ చాలా సరదాగా ఉన్నాయని వారు పేర్కొనడంతో ఈ డైలాగ్ కాస్తా సినిమా ప్రమోషన్‌కు భారీగా ప్లస్ అయింది.