• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య.. బ్యాక్ టు బ్యాక్...

సూర్య.. బ్యాక్ టు బ్యాక్ మరొకటి..

| నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సూర్య 45 మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

By - Tupaki Desk
Update: 2024-10-14 14:14 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాజుల కాలం నాటి కథతో రూపొందుతున్న కంగువా మూవీకి సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా రిలీజ్ కావాల్సిన ఆ సినిమాను వాయిదా వేశారు. నవంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు.

 

ఆ తర్వాత ఇటీవల సూర్య 44 ప్రాజెక్ట్ ను కూడా కంప్లీట్ చేశారు కోలీవుడ్ హీరో. జిగర్తండా డ‌బుల్ ఎక్స్‌ తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.. సూర్య 44ను గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంట‌ర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

విభిన్నమైన, ప్రత్యేకమైన కంటెంట్‌ తో కమర్షియల్ బ్లాక్‌ బస్టర్‌ లను నిర్మించడంలో పేరు గాంచిన ప్రొడక్షన్ హౌస్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌ తో చేతులు కలిపారు సూర్య. ఇప్పటి వరకు తమ బ్యానర్ పై అత్యంత ఖరీదైన సినిమాగా సూర్య 45ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో సోమవారం అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆ సమయంలో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. బ్లాక్ కలర్ షేడ్ తో ఉన్న పోస్టర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సూర్య 45 మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్.. సినిమాలో భాగమైనట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. అడ్వెంచర్ యాక్షన్ జోనర్ లో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆయన.. ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బాలాజీకి.. ఆర్జేగా మంచి గుర్తింపు ఉంది. రేడియో కార్యక్రమాల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన.. నటుడిగా కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. మూకుతి అమ్మన్, వీట్ల విశేషం లాంటి కామెడీ టచ్ ఉన్న సినిమాలను తెరకెక్కించారు. యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్.. అలా అన్నింట్లో ఆల్ రౌండర్ అయిన ఆయన.. ఇప్పుడు సూర్యతో వర్క్ చేసే అవకాశం అందుకున్నారు. మరి మూవీని ఎలా తీస్తారో చూడాలి.

Tags:    
  • Suriya 
  • RJBalaji 
  • ARRahman 
  • Indiancinema 
  • Dreamwarriorpictures 
  • Telugu 
  • Tamil 
  • Filmindustry 

Similar News

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

అందుకే అత‌డు టాలీవుడ్ 'రియ‌ల్ కింగ్'

2026-11-08 11:10 GMT

నందమూరి ఫ్యామిలీని మళ్ళీ ఇలా చూడతరమా..!

2026-11-08 11:09 GMT

2027 సంక్రాంతి బరిలో హీరోయిన్ల హవా!

2026-11-08 11:09 GMT

ఇంత మంచి సీన్ ఎలా తీసేయాలి అనిపించింది రామ..!

2026-11-08 11:09 GMT

'దాదా' సర్ ప్రైజ్.. తమన్‌కు ఈసారి పెద్ద టార్గెట్!

2026-11-08 07:52 GMT

Copyright @2026

Powered by Blink CMS