సూర్య సీన్ మారింది.. ఆవేశం మేకర్ తో ఇలా..
తాజాగా వాటిని నిజం చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. విడుదలైన టైటిల్ టీజర్ లో సూర్య లుక్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో సిద్ధమవుతున్నారు. ఆ సినిమాకు సీన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రోమాంచం, ఆవేశం వంటి చిత్రాలను తెరకెక్కించిన మాలీవుడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ ఆ సినిమాను రూపొందిస్తున్నారు. లేటెస్ట్ గా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటిస్తూ మూవీ టీమ్ టీజర్ ను రిలీజ్ చేసింది.
ఇప్పటివరకు సూర్య 47గా పిలుస్తున్న ఆ సినిమాకు సీన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. విడుదలైన టైటిల్ టీజర్ లో సూర్య లుక్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. షార్ట్, టీషర్ట్ లో సరికొత్త మేకోవర్ లో కనిపించిన ఆయన.. స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. జైలులో ఖైదీల మధ్య నుంచి ఓ పోలీస్ అధికారి భుజంపై చేయి వేసుకుని సూర్య నడుచుకుంటూ వచ్చే సీన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
టీజర్ ను చూస్తుంటే సూర్య ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా సీన్ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. జీతూ మాధవన్ స్టైల్ కు తగ్గట్టుగా మాస్ యాక్షన్ తో పాటు కామెడీకి కూడా ఇంపార్టన్స్ ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సూర్య రోల్ చుట్టూ ఉండే సీన్స్ సినిమాపై హైప్ పెంచుతున్నాయి. అయితే స్టోరీ, రోల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మూవీ టీమ్ ప్రస్తుతానికి వెల్లడించలేదు.
సినిమాలో సూర్యకు జోడీగా మాలీవుడ్ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన యాక్టర్ నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సూర్య, జ్యోతికకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినిమాకు మరో స్పెషాలిటీ మ్యూజిక్.
మలయాళంలో తనదైన మ్యూజిక్ తో ఆకట్టుకుంటున్న సుశిన్ శ్యామ్ ఆ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జీతూ మాధవన్ గత చిత్రాలైన రోమాంచం, ఆవేశం సినిమాలకు కూడా సుశిన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు. దీంతో సీన్ కు కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సూర్య నుంచి ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.
మే 15న కరుప్పు, ఆ తర్వాత ఆగస్టు 14న విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు సీన్ ఈ ఏడాది సూర్య నుంచి రాబోతున్న మూడో సినిమా కానుంది. ఇక సీన్ మూవీని దీపావళి కానుకగా 2026 నవంబర్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే రోజున రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటిస్తున్న రామాయణ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రెండు భారీ చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మరి సూర్య సీన్ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.