దేవుడే సూర్య అన్న రూపంలో ఆ పని చేయించారు
అయితే సూర్య కేవలం హీరో లాగా మాత్రమే కాకుండా ఎన్నో మంచి పనుల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.;
కోలీవుడ్ హీరో సూర్యకు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటూ తెలుగులో కూడా రిలీజవుతూ ఉంటుంది. అంతేకాదు, సూర్య సినిమా రిలీజవుతుందంటే కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా సందడి నెలకొంటుంది. అయితే సూర్య కేవలం హీరో లాగా మాత్రమే కాకుండా ఎన్నో మంచి పనుల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి చేయూత
అందుకే సూర్య వెండితెర పైనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని అందరూ అంటుంటారు. తాను సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగిచ్చేసే హీరోల్లో సూర్య కూడా ఒకరు. 2006లో అగరం ఫౌండేషన్ ను స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతో మంది పేదలకు విద్యను అందిస్తూ వస్తున్న సూర్య ఇప్పటికే ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది డాక్టర్లను, ఇంజనీర్లను సమాజానికి అందించారు.
అంతేకాదు, సూర్య ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేశారనే విషయాన్ని చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. సూర్య చేసిన గొప్ప పని ఒకటి ఇప్పుడు మరొకటి బయటికొచ్చింది. కార్తీ నటించిన వా వాతియార్ మూవీకి సంబంధించిన ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ ఓ విషయాన్ని వెల్లడించారు. రీసెంట్ గా నిర్మాత జ్ఞానవేల్ రాజా చాలా సమస్యలను ఎదుర్కొన్నారని, ఆ టైమ్ లో సూర్య అన్న ఆయనకు ఫోన్ చేసి ఒక పరిష్కారాన్ని చెప్పారని, దేవుడే సూర్య అన్న రూపంలో ఆ పని చేయించారని ఆయన చెప్పారు.
సూర్య సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శక్తివేలన్
అయితే శక్తివేలన్ సూర్యను ప్రశంసించడం, ఆయన చేసిన గొప్ప పనుల గురించి తెలియచేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆయనకు సూర్య అంటే ఎంతో అభిమానం. సూర్య నటించిన ఎన్నో సినిమాలను శక్తి ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసిన శక్తివేలన్, ఆ సినిమాలు హిట్టైన సందర్భంలో సూర్యకు డైమండ్ రింగ్స్, డైమండ్ బ్రేస్‌లెట్స్ ను బహుకరించిన సంగతి తెలిసిందే.