కమెడియన్స్ కి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. క్షమాపణ చెప్పి తీరాల్సిందే!
హాస్యం అనేది మన జీవితంలో భాగం.. కానీ అదే జీవితం కాకూడదు.. ఇతరులతో మనం కూర్చొని నవ్వవచ్చు.;
హాస్యం అనేది మన జీవితంలో భాగం.. కానీ అదే జీవితం కాకూడదు.. ఇతరులతో మనం కూర్చొని నవ్వవచ్చు. కానీ ఇతరులను చూసి నవ్వకూడదు అని అంటుంటారు పెద్దలు. ఎందుకంటే హాస్యం అనేది అన్ని విషయాల్లో పనికిరాదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ స్టాండప్ కామెడీ కంటెంట్ ల ద్వారా ఎంతోమందికి నవ్వు పుట్టించడం కోసం ఎన్నో రకాల అసభ్య మాటలు మాట్లాడడంతో పాటు ఇతరులను కించపరిచేలా కూడా మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా కొంతమంది కమెడియన్లు వికలాంగులను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వీడియోలపై సుప్రీంకోర్టు మండిపడింది.అంతేకాదు తాజాగా ఆ కమెడియన్ లకు పెద్ద షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ వికలాంగులను ఎగతాళి చేసిన కమెడియన్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొంతమంది వికలాంగులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకరమైన జోకులు వేస్తూ ఆనందం పొందుతున్నారు.. అయితే సమాజంలో జోకులు వేయడం మంచిదే కానీ అణుచిత జోకులు వేయడం, ఇతరులను ఎగతాళి చేసేలా మాట్లాడడం న్యాయం కాదు అని, అలాంటి పనులు చేసే వారిని కచ్చితంగా శిక్షించాల్సిందే అంటూ భారత సుప్రీంకోర్టు తాజాగా హెచ్చరించింది. వికలాంగులను ఎగతాళి చేస్తూ వాళ్లపై అణుచిత జోకులు వేసినందుకుగానూ ఐదుగురు కమెడియన్లపై మండిపడింది. తాజాగా వికలాంగుల గురించి ఎగతాళిగా మాట్లాడిన కమెడియన్లపై వికలాంగుల హక్కుల సంస్థ అయినటువంటి SMS క్యూర్ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ ని తాజాగా జస్టిస్ సూర్యకాంత్, జోయ్ మల్య బాగ్చిలా ధర్మాసనం విచారించి సంచలన తీర్పు ఇచ్చింది.. ఈ తీర్పులో భాగంగా.. వికలాంగులను కించపరుస్తూ మాట్లాడిన హాస్యనటులు అయినటువంటి విపున్ గోయల్, నిశాంత్ జగదీష్ తన్వర్, సమయ్ రైనా, సోనాలి ఠక్కర్, బాల్రాజ్ పరంజీత్ సింగ్ ఘాయ్ లకి షాక్ ఇచ్చింది. వీళ్లు తమ స్టాండప్ కంటెంట్ లో వికలాంగులను ఎగతాళి చేస్తూ మాట్లాడారు.. కానీ అలా ఇతరులని కించపరచడం సరికాదు. ముఖ్యంగా వికలాంగులను ఎగతాళి చేస్తూ మాట్లాడడం తప్పు అని వార్నింగ్ ఇచ్చింది. సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ ఐదుగురు కమెడియన్లు కోర్టు ముందు క్షమాపణలు చెప్పారు.కానీ కోర్టులో కాదు మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో కూడా ఆ వికలాంగులకి క్షమాపణలు చెప్పాలని.. బహిరంగ క్షమాపణలు చెప్పడమే మీరు చేసిన పనికి శిక్ష అంటూ తీర్పు చెప్పారు..
అలాగే శిక్ష , జరిమానాని తర్వాత నిర్ణయిస్తామని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి అణుచిత జోకులు వేస్తే సహించేది లేదంటూ మండిపడింది. అంతేకాదు డబ్బు సంపాదించడం కోసం ఇతరులను ఎగతాళి చేస్తూ వినోదం కోసం.. మీ లాభం కోసం ఇలాంటి జోకులు వేయకూడదు అంటూ హెచ్చరించింది.