దర్శన్ కేసు.. సుప్రీం సీరియస్..!

చట్టానికి అందరు సమానం ఎవరు అతీతులు కాదంటూ తీర్మానం ఇచ్చింది. దర్శన్ కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.;

Update: 2025-08-14 10:19 GMT

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ దర్శన్ బెయిన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిన్ రీర్పుని సుప్రీం కొట్టిపారేసింది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ల ఆధ్వర్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.

చట్టానికి అందరు సమానం..

చట్టానికి అందరు సమానం ఎవరు అతీతులు కాదంటూ తీర్మానం ఇచ్చింది. దర్శన్ కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులపై ప్రభావం చూపిస్తుందని జస్టిస్ మహాదేవన్ అన్నారు. అంతేకాదు కస్టడీలో ఉన్న దర్శన్ కు ఎలాంటి స్పెషల్ ఫెసిలిటీస్ అందించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించారు.

నిందితులకు జైల్లో ఫైవ్ స్టార్ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు వస్తే జైలు సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు 15 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. సంచలనంగా మారిన ఈ కేసు విషయంలో దర్శన్ ని సపోర్ట్ చేస్తున్న వారు ఉన్నారు. ఐతే చట్టానికి అందరు సమానమే.. అక్కడ న్యాయం మాత్రమే తెలుస్తుందంటూ సుప్రీంకోర్టు చెబుతుంది.

దర్శన్ కు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్..

ఈ కేసు విషయంలో రేణుకాస్వామి కుటుంబం ఫైట్ చేస్తుంది. ఐతే సెలబ్రిటీ అయిన కారణంగా జైల్లో కూడా దర్శన్ కు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు సుప్రీం కోర్ట్ దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఐతే అలా స్పెషల్ ఫెసిలిటీస్ అందించినట్టు తేలితే మాత్రం జైల్ సూపరింటెండెంట్ పై యాక్షన్ తీసుకునేందుకు సుప్రీం కోర్ట్ రెడీ అయ్యింది.

దర్శన్ కేసు కోర్టులో ఉండగా అతని మీద ఎవరైనా సెలబ్రిటీస్ కాస్త నెగిటివ్ గా మాట్లాడితే చాలు వాళ్ల మీద దర్శన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈమధ్యనే ఒకప్పటి హీరో రమ్య దర్శన్ పై చేసిన కామెంట్స్ కి అతని ఫ్యాన్స్ ఆమెపై బెదిరింపులకు దిగారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఐతే విషయం పెద్దది అవ్వకముందే కన్నడ పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగి వ్యవహారం సర్దుమనిగేలా చేశారు. దర్శన్ ఫ్యాన్స్ అతని బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే కేసు విషయంలో సుప్రీం కోర్టులో హడావిడి చూస్తుంటే త్వరలోనే తీర్పు వచ్చేలా ఉంది.

Tags:    

Similar News