దర్శన్, పవిత్ర మళ్ళీ అరెస్ట్.. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు సీరియస్!

బెయిల్ మీద ఉన్న బయట ఉన్న ప్రముఖ నటి పవిత్ర గౌడ, హీరో దర్శన్ ను నేడు మళ్ళీ పోలీసులు అరెస్టు చేశారు.;

Update: 2025-08-14 13:26 GMT

బెయిల్ మీద ఉన్న బయట ఉన్న ప్రముఖ నటి పవిత్ర గౌడ, హీరో దర్శన్ ను నేడు మళ్ళీ పోలీసులు అరెస్టు చేశారు. అభిమాని రేణుక స్వామి హత్య కేసులో గత ఏడాది జూన్ 11వ తేదీన పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే . అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన పవిత్ర గౌడతో పాటు ప్రధాన నిందితుడుగా నిలిచిన దర్శన్ కి అలాగే మిగతా 7 మంది వ్యక్తులకు డిసెంబర్ 13న గత ఏడాది కర్ణాటక హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరి బెయిల్ ని వ్యతిరేకిస్తూ బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. నేడు పిటిషన్ విచారించిన ధర్మాసనం బెయిల్ రద్దు చేస్తూ వెంటనే అరెస్టు చేయమని ఆదేశాలు జారీ చేసింది.

అసలు విషయంలోకి వెళ్తే.. కర్ణాటక హైకోర్టు గతంలో దర్శన్, పవిత్ర గౌడ తోపాటు దాదాపు ఏడుగురికి బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక ప్రభుత్వం. అయితే ఆ బెయిల్ రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై గురువారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్ ఉన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టేసింది. ఇక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా లోపాలు ఉన్నాయని.. వారికి బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి చట్టపరమైన కారణం లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించడమే కాకుండా దర్శన్ తూగుదీపాకు బెయిల్ ఇస్తే న్యాయ పరిపాలనను పట్టాలు తప్పే ప్రమాదం కూడా కలిగిస్తుందని చెబుతూ నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది..

అంతేకాదు జైలులో వీరికి ప్రత్యేక సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదని కూడా కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్ఆర్ నగర్లో ఉన్న పవిత్ర గౌడను, మైసూర్ లో ఉన్న దర్శన్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దర్శన్ వీరాభిమాని రేణుక స్వామి దర్శన్ ను విడిచిపెట్టాలి అని పవిత్ర గౌడ కు అసభ్యకర మెసేజ్లు పంపించిన విషయం తెలిసిందే. ఇలా పంపించడానికి కూడా కారణం ఉంది. నిజానికి దర్శన్ కి ముందుగానే వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్యను కాదని పవిత్ర గౌడతో దర్శన్ ఎఫైర్ పెట్టుకున్నాడనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు పవిత్ర గౌడ దర్శన్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మా బంధానికి పది సంవత్సరాలు అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిత్రదుర్గా కు చెందిన రేణుక స్వామి పవిత్ర గౌడ కు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ విసిగించాడట దీంతో పవిత్ర గౌడ రేణుక స్వామి పై కక్ష పెట్టుకుని , దాదాపు 7 మందికి సుఫారీ ఇచ్చి దర్శన్ తో కలిసి రేణుక స్వామిని హత్య చేశారు.. ఈ కేసులోనే గత ఏడాది జూన్ 11వ తేదీన పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కానీ వీరంతా బెయిల్ మీద బయట తిరగడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో బెంగళూరు పోలీసులు సుప్రీంకోర్టులో కేసు వేయగా.. వీరిని మళ్లీ అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News