సూప‌ర్‌మేన్ పాత్ర‌లో విల్ స్మిత్? బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెళ్ల‌తోను దూకుడు!

హాలీవుడ్ వర్గాలలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ నటుడు విల్ స్మిత్ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ `సూపర్‌మ్యాక్స్` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Update: 2026-05-20 08:21 GMT

హాలీవుడ్ వర్గాలలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ నటుడు విల్ స్మిత్ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ `సూపర్‌మ్యాక్స్` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. చాలామంది సోషల్ మీడియాలో పొరబడుతున్నట్లు ఇది డీసీ కామిక్స్ కి సంబంధించిన `సూపర్‌మ్యాన్` సినిమా కాదు. విల్ న‌టించేది ఒక హై-వోల్టేజ్ ప్రిజన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. 2022 ఆస్కార్ అవార్డుల వేదికపై హాస్యనటుడు క్రిస్ రాక్‌ను కొట్టిన వివాదాస్పద సంఘటన తర్వాత విల్ స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూడవ పెద్ద ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన హక్కులను అమేజాన్ ఎంజీఎం స్టూడియోస్ దక్కించుకుంది. `ది ఎక్సార్సిస్ట్: బిలీవర్`, `హాలోవీన్` వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డేవిడ్ గోర్డాన్ గ్రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా మాత్రమే ఇది ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఒక జైలు నేపథ్యంలో జరిగే హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దీనిని దర్యాప్తు చేసే ఇద్దరు ఎఫ్‌బీఐ ఏజెంట్ల కథనంతో ఊహించని మలుపులతో సాగే ఈ చిత్రంలో విల్ స్మిత్ `రెక్స్` అనే లీడ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 2026 ఆగస్టు మధ్యలో ప్రారంభం కానుంది.

విల్ స్మిత్‌కు చెందిన సొంత‌ నిర్మాణ సంస్థ వెస్ట్‌బ్రూక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హంటర్స్, ఇన్వేషన్ వంటి పాపులర్ సిరీస్‌లకు పనిచేసిన డేవిడ్ వెయిల్, డేవిడ్ జె. రోసెన్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. 2022 ఆస్కార్ వివాదం తర్వాత విల్ స్మిత్‌పై 10 ఏళ్ల పాటు ఆస్కార్ వేడుకలకు హాజరుకాకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత ఆయన నటించిన `ఎమాన్సిపేషన్` (2022), మార్టిన్ లారెన్స్‌తో కలిసి నటించిన `బ్యాడ్ బాయ్స్ 4` (2024) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి విల్ స్మిత్ క్రేజ్ తగ్గలేదని నిరూపించాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు వస్తున్న `సూపర్‌మ్యాక్స్` పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక విల్ స్మిత్ కెరీర్‌లోనే ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ చిత్రం `ఐ యామ్ లెజెండ్` (2007) సీక్వెల్ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `ఐ యామ్ లెజెండ్ 2` ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగంగా స్క్రిప్ట్ పనులను జరుపుకుంటోంది. ఈ సీక్వెల్‌లో విల్ స్మిత్‌తో పాటు మరో క్రేజీ హాలీవుడ్ స్టార్ మైఖేల్ బి. జోర్డాన్ కీలక పాత్రలో నటిస్తూ... నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, ప్రతిభ ఈ ప్రాజెక్ట్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని హాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీక్వెల్ పనులు చాలా ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాయని స్వయంగా విల్ స్మిత్ గతంలో ప్రకటించారు.

ఇవే కాకుండా విల్ స్మిత్ ఖాతాలో మరికొన్ని సంచలన ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా విల్ సూపర్ హీరోగా నటించిన `హ్యాన్‌కాక్` (2008) చిత్రానికి సీక్వెల్ తెచ్చే ఆలోచనలో ఉన్నారు. `హ్యాన్‌కాక్ 2` కోసం ఒక అద్భుతమైన లైన్ సిద్ధంగా ఉందని అందులో ఒక కీలక పాత్ర కోసం గ్లోబల్ స్టార్ జెండాయాను సంప్రదించబోతున్నట్లు విల్ స్మిత్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. ఏదేమైనా.. వివాదాల నుంచి కోలుకుంటూ సూపర్‌మ్యాక్స్, ఐ యామ్ లెజెండ్ 2, హ్యాన్‌కాక్ 2 వంటి వరుస భారీ చిత్రాలతో విల్ స్మిత్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News