మెడ కోసుకుని ఒళ్లంతా రక్తం.. సన్నీలియోన్‌కి ఏమైంది?
ఈ రూపం చూడగానే, ఎవరికైనా ఇలాంటి సందేహం కలగడం సహజం. అక్కడ ఏదైనా జరగకూడనిది జరిగిందా? అని ఆశ్చర్యపోవద్దు.;
అవును.. చాకుతో మెడ కోసుకుంది.. ఎర్రని రక్తం చివ్వుమంది.. మెడ నుంచి దిగువకు ఒళ్లంతా రక్తం ప్రవహించింది... కళ్ల చుట్టూ నల్లని వలయాలు.. భయంకరమైన దట్టమైన పొద లాంటి జుత్తు.. చిక్కటి ఎరుపు రంగు పెదవులకు నలుపు రంగు అంటినట్టు.. ఇదంతా చూస్తుంటే.. అసలింతకీ ఏమైంది సన్నీలియోన్ కి?
ఈ రూపం చూడగానే, ఎవరికైనా ఇలాంటి సందేహం కలగడం సహజం. అక్కడ ఏదైనా జరగకూడనిది జరిగిందా? అని ఆశ్చర్యపోవద్దు. సహజంగానే సన్నీలియోన్ కి `హాలోవీన్` పిచ్చి ఎక్కువ. అందుకే ఇప్పుడు ఇలా గెటప్ ఛేంజ్ చేసింది. ఉన్నట్టుండి ఇలా భయంకరమైన వేషధారణతో గుబులు పుట్టించేస్తోంది.
ఒళ్లంతా రక్తం పులుముకున్న భూతం మరో కోణంలో ఇంత అందంగా ఉంటుందా? అనిపించేలా ఈ స్పెషల్ యూనిక్ మేకప్ ఆశ్చర్యపరుస్తోంది. ఆ తలలో అందమైన పింక్ రోజాలు మొత్తం సన్నివేశాన్ని లైటప్ అయ్యేలా చేసాయి. హాలోవీన్ అనేది భయపెట్టేందుకు మాత్రమే కాదు.. కొంత ఫన్ ని కూడా పరిచయం చేసేందుకు.. ఇప్పుడు సన్నీలియోన్ ఈ వేషంలో చేస్తున్నది అదే..
తన ఇద్దరు పిల్లలు, దత్త పుత్రికతో పాటు భర్త డేనియల్ వెబర్ ని ఎంతో ప్రేమగా, లాలనగా చూసుకునే సన్నీలియోన్ ఇటీవలి కాలంలో పూర్తిగా కుటుంబ బాధ్యతలతోనే బిజీ అయిపోయింది. మరోవైపు సౌందర్య ఉత్పత్తుల కంపెనీ విస్తరణ పనులతోను బిజీ బిజీగా మారింది. సినిమాలు తగ్గిపోయాక, సన్నీలియోన్ పూర్తిగా ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించేందుకు ప్రయత్నిస్తోంది.