సన్నీలియోన్ స్టన్నింగ్ లుక్ వైరల్
తాజాగా సన్నీలియోన్ ప్రఖ్యాత ఫ్యాషన్ మ్యాగజైన్ - కల్చర్డ్ వెడ్డింగ్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. నీలి రంగు డిజైనర్ శారీ ధరించిన సన్నీలియోన్ ఈ ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది.;
తనదైన అందం, అద్భుత ప్రతిభతో బాలీవుడ్ లో మెరుపులు మెరిపించిన సన్నీలియోన్ ఇటీవలి కాలంలో పూర్తిగా తన సమయాన్ని కుటుంబం, పిల్లలు, వ్యాపారాలకు మాత్రమే అంకితమిస్తోంది. ముఖ్యంగా ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించేందుకు తెలివైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన సన్నీ భారీగా ఆర్జిస్తోంది. కారణం ఏదైనా కానీ, సన్నీ సినిమాలు తగ్గించింది. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తుండటంతో తన ఉనికి అంతగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఇతర స్టార్లకు ధీటుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది.
తాజాగా సన్నీలియోన్ ప్రఖ్యాత ఫ్యాషన్ మ్యాగజైన్ - కల్చర్డ్ వెడ్డింగ్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. నీలి రంగు డిజైనర్ శారీ ధరించిన సన్నీలియోన్ ఈ ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. హాఫ్ షోల్డర్ గౌనులో సన్నీ గ్లామర్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
గ్లామర్, గ్రేస్ , తిరుగులేని ఆకర్షణను ఇలా సన్నీ రూపంలో ఆవిష్కరిస్తున్నామని కల్చర్డ్ వెడ్డింగ్ కవర్ పేజీ కర్తలు వెల్లడించారు. అద్భుతమైన ఎనర్జీ, ప్రత్యేక శైలితో సన్నీలియోన్ మరోసారి తానేంటో నిరూపిస్తోంది. సన్నీలియోన్ వ్యక్తిగత కుటుంబ జీవనం విషయానికి వస్తే, సరోగసీలో జన్మించిన బిడ్డతో పాటు పలువురు చిన్నారులను దత్తత తీసుకుని సన్నీలియోన్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన భర్త డేనియల్ వెబర్ అన్నివిధాలా తనకు సహకారం అందిస్తున్నాడు.