#గుసగుస.. మాఫియానే బెదిరించిన హీరో
సల్మాన్ ఖాన్, రాకేష్ రోషన్, టి సిరీస్ గుల్షన్ కుమార్, దివ్య భారతి, .. ఒకరేమిటి మాఫియా బెదిరింపులు ఎదుర్కొన్న సినీప్రముఖులు ఎందరో ఉన్నారు.;
సల్మాన్ ఖాన్, రాకేష్ రోషన్, టి సిరీస్ గుల్షన్ కుమార్, దివ్య భారతి, .. ఒకరేమిటి మాఫియా బెదిరింపులు ఎదుర్కొన్న సినీప్రముఖులు ఎందరో ఉన్నారు. ఇదే జాబితాలో హిందీ నటుడు సునీల్ శెట్టి, ఆయన తండ్రి కూడా ఉన్నాడు. అయితే మాఫియా బెదిరించడం అలా ఉంచితే, మాఫియానే తాను బెదిరించానని అన్నాడు సునీల్ శెట్టి.
ముంబైలో శెట్టి అనే ఇంటి పేరున్న వారందరినీ అండర్ వరల్డ్ బెదిరించేది. అయితే మేమంతా ఒకటిగా ఉన్నాం. తిరిగి అండర్ వరల్డ్ నే బెదిరించామని శెట్టి చెప్పారు. ఆ రోజుల్లో ఇలాంటివి చాలా కామన్ గా జరిగేవేనని కూడా సునీల్ శెట్టి వ్యాఖ్యానించారు. అండర్ వరల్డ్ ఒత్తిడి అంతకంతకు పెరిగిపోవడం వల్ల తాము కూడా ఒక గ్యాంగ్ ని తయారు చేసుకుని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని సునీల్ శెట్టి వెల్లడించారు. శెట్టి అనే ఇంటి పేరు చెబితే డబ్బు కట్టాలని బెదిరించేవారని కూడా గుర్తు చేసుకున్నాడు.
భయపెడితే డబ్బు చెల్లిస్తామని భావించి బెదిరించేవారని కూడా అన్నారు. ఒకసారి హేమంత్ పుజారి అనే గ్యాంగ్ స్టర్ సునీల్ శెట్టి తండ్రి వాకింగ్ కి వెళ్లినప్పుడు తెల్లవారుఝామున తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించినట్టు వెల్లడించాడు. అంతేకాదు తనను బెదిరించడం ద్వారా పుజారీ ఎదగాలని భావించేవాడని కూడా తెలిపారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే, సునీల్ శెట్టి తదుపరి సూరజ్ పాంచోళీతో కలిసి కేసరి వీర్ లో నటిస్తున్నాడు.