సందీప్ మాయవన్.. కామన్ మ్యాన్ Vs సూపర్ విలన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్

Update: 2024-05-09 08:48 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటీవల ఊరు పేరు భైరవకోన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు తమిళ- తెలుగు ద్విభాషా చిత్రం మాయావన్ షూటింగ్‌ ను స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. 2017లో వచ్చిన ప్రాజెక్ట్-జెడ్ కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ ను క్రియేటివ్ డైరెక్టర్ సీవీ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ పవర్ ప్యాక్డ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ ఒక పిడికిలిని బిగించి మరో చేతిలో సూపర్ పవర్ వెపన్ తో కనిపిస్తున్న పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ తో వచ్చారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. 'కామన్ మ్యాన్ Vs సూపర్ విలన్.. మాయావన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్' అంటూ ట్వీట్ చేశారు.

Read more!

ఇక ఈ సినిమా టీజర్.. ఆడియన్స్ కు మాయావన్ ప్రపంచాన్ని చూపిస్తూ.. అందులో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తుంది. మంచులో ఉన్న సైన్స్ ల్యాబ్ ను చూపించారు మేకర్స్. అందులో మెదడును ఒక వ్యక్తి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయోగాలు జరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విలన్ గా నటిస్తున్న నితిన్ ముఖేష్ కు సూపర్ పవర్స్ ఉంటాయి. కామన్ మ్యాన్ గా కనిపించే సందీప్ కు చివర్లో పవర్స్ వస్తాయి.

హీరోయిన్ ఆకాంక్ష రంజన్‌ కపూర్ తో హీరో లవ్ ట్రాక్ కూడా చూపించారు మేకర్స్. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్.. తన యాక్షన్ తో అదరగొట్టారు. సూపర్ పవర్స్ వచ్చాక విన్యాసాలు చేస్తూ కనిపించారు. సీవీ కుమార్.. మాయావన్ ప్రపంచాన్ని గ్రాండ్ గా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి టీజర్.. మూవీపై ఆసక్తి పెంచుతోందని నెటిజన్లు చెబుతున్నారు. ట్రైలర్ కట్ చేసే విధానం బాగుందని అంటున్నారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న మాయావన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా, కిషోర్ గరికపాటి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మురళీ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News