కుబేరలో నాగార్జున వైఫ్.. బయట చూస్తే షాకే..

అయితే నాగార్జున భార్యగా సినిమాలో ఎవరు కనిపించారో మీకు గుర్తుందా?.. ఆమె స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది.;

Update: 2025-07-01 21:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఆ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అత్యంత ధనవంతుడికి, అతి పేదవాడి మధ్య జరిగిన సంఘర్షణను సినిమాను తీసి.. అందరినీ మెప్పించారు శేఖర్ కమ్ముల. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అలరించారు. అయితే సినిమాలో బిచ్చగాడి రోల్ లో ధనుష్ ఇరగదీశారు. పాత్రలో జీవించారు. నాగార్జున కూడా తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆయన తప్ప ఎవరూ ఆ రోల్ లో నటించలేరంతగా అలరించారు.

అయితే నాగార్జున భార్యగా సినిమాలో ఎవరు కనిపించారో మీకు గుర్తుందా?.. ఆమె స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన యాక్టింగ్ తో అలరించింది. ఆమె ఎవరో కాదు.. పేరు సునయన.. ఎక్కడో పేరు విన్నట్లు ఉంది కదూ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలే.

2005లో సమ్ థింగ్ స్పెషల్ మూవీతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సునయన. ఆ తర్వాత 10th క్లాస్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎక్కువ కోలీవుడ్ మూవీస్ లోనే యాక్ట్ చేస్తున్న అమ్మడు.. అడపాదడపా తెలుగు చిత్రాల్లో కనిపించి మెరుస్తోంది. రీసెంట్ గా రాజ రాజ చోరలో యాక్ట్ చేసింది.

ఇప్పుడు కుబేరతో మంచి మార్కులు ఆమె సొంతమయ్యాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో సునయన యమా యాక్టివ్. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. రకరకాల అవుట్ ఫిట్స్ లో దిగిన పిక్స్ ను పోస్ట్ చేస్తుండగా.. నెటిజన్లు, సినీ ప్రియులు ఫుల్ అట్రాక్ట్ అవుతుంటారు.

కుబేర రిలీజ్ అయ్యాక ఆమె లేటెస్ట్ పిక్స్.. తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో కుబేర‌లో సున‌య‌న‌కు బ‌య‌ట సున‌య‌న‌కు చాలా డిఫరెన్స్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. అసలు పొంత‌నే లేదుగా అంటూ అభిప్రాయపడుతున్నారు. తెలుగులో మరిన్ని సినిమా ఛాన్స్ లు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News