బిగ్ బాస్ 9.. అతని సపోర్ట్ తో సుమన్ గెలుపు.. ఓడిన టాప్ కంటెస్టెంట్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ గెలిచి టికెట్ టు ఫినాలే దక్కించుకుని ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అవ్వాలని కంటెస్టెంట్స్ అంతా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ గెలిచి టికెట్ టు ఫినాలే దక్కించుకుని ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అవ్వాలని కంటెస్టెంట్స్ అంతా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. హౌస్ లో ఉన్న వారంతా కూడా ఈ టాస్క్ లో పాల్గొనగా మొదటి రౌండ్ లోనే సంజన టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్ తో ఆమె ఆడిన ఆట ఓడిపోవడం తో టాస్క్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇక నెక్స్ట్ తనూజ, సుమన్ రెండో ఎలిమినేషన్ టాస్క్ ఆడారు.
తనూజ, సుమన్ శెట్టి వాటర్ టాస్క్..
తన ప్రత్యర్ధిగా సుమన్ ని ఎంచుకున్న తనూజ అతనితో ఆడి గెలుద్దామని అనుకుంది. తనూజ, సుమన్ శెట్టిలకు వాటర్ టాస్క్ ఇచ్చాడు. రెండు చేతులతో తాళ్లను పట్టుకుని వాటర్ ని బ్యాలెన్స్ చేయాలి. ఐతే ఈ టాస్క్ లో బజర్ మోగిన టైం లో ఒక కంటెస్టెంట్ వచ్చి ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్లని వదిలి అవతల వ్యక్తి ట్యాంక్ లో నీళ్లు పడేలా ట్యాప్ తిప్పాలి. ఈ టాస్క్ కి సంజన సంచాలక్ గా ఉండగా ఆమె భరణిని 3 సార్లు, కళ్యాణ్ ని 2 సార్లు, డీమాన్ పవన్ ఇలా వరుసగా పిలిచింది.
ఐతే భరణి సుమన్ శెట్టిని గెలిపించే ఉద్దేశ్యంతో తను వెళ్లిన ప్రతిసారి తనూజ ట్యాంక్ లోనే వాటర్ పోశాడు. అలా తనూజ మాక్సిమం చాలా కష్టపడింది ఫైనల్ గా ఆమె తాళ్లు వదిలేసే సరికి తన ట్యాంక్ లో ఉన్న వాటర్ కింద పడ్డాయి. అలా తనూజ ఈ టాస్క్ ఓడిపోయింది. సుమన్ శెట్టి టాస్క్ గెలిచాడు. తనూజ టాస్క్ ఓడిపోవడంతో టికెట్ టు ఫినాలే టాస్క్ నుంచి తొలగించబడింది.
హౌస్ మేట్స్ సపోర్ట్ ఉండటం..
సో తనూజ, సుమన్ తో అయితే ఈజీగా గెలవొచ్చు అని అనుకుని అతన్ని తన అపోనెంట్ గా చేసుకోగా అది ఆమెకు రివర్స్ కొట్టింది. ఈ టాస్క్ ఆ ఇద్దరు మాత్రమే కాకుండా హౌస్ మేట్స్ సపోర్ట్ ఉండటం అనేది కరెక్ట్ కాదన్నది ఆడియన్స్ పాయింట్. ఏది ఏమైనా సుమన్ గెలిచి టికెట్ టు ఫినాలే టాస్క్ లో ముందుకు వెళ్లగా ఓడిన తనూజ టికెట్ టు ఫినాలే రేసు నుంచి బయటకు వచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ టు ఫినాలే ఆల్రెడీ టాప్ లో ఉంటారన్న కంటెస్టెంట్ గెలిస్తే పర్లేదు కానీ టాప్ 5 ఛాన్స్ లేరని అనుకునే కంటెస్టెంట్ గెలిస్తే కచ్చితంగా సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది. ఐతే టాప్ 5 ఏమో కానీ టాప్ 3, 4 కంటెస్టెంట్స్ అయితే పక్కా అని ఆడియన్స్ ఆ నలుగురిని ఫిక్స్ అయిపోయారు.