బిగ్ బాస్ 9.. వేలు చూపించకు.. నామినేషన్స్ ఫైర్.. ఏం జరిగింది అంటే..?

ఐతే కళ్యాణ్ ని నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు.;

Update: 2025-11-18 04:16 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ హీటు పెంచేశాయి. ఒక్కొక్కరు ఇక సేఫ్ ఆడితే బాగోదని తమ ముసుగు తీసి నామినేషన్స్ వేశారు. ముఖ్యంగా డీమాన్ పవన్ రీతూని నామినేట్ చేస్తాడని ఎవరు ఊహించరు. ప్రతి విషయంలో రీతు తనని అర్ధం చేసుకోవట్లేదని అరుస్తూ విషయం పెద్దది చేస్తుందని అన్నది. రీతుతో పాటు కళ్యాణి కూడా నామినేట్ చేశాడు డీమాన్ పవన్.

కళ్యాణ్ డెసిషన్ మీద సుమన్ శెట్టి నామినేట్..

కెప్టెన్ అయిన తనూజకి నామినేషన్స్ లో ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలన్న ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. డీమాన్, భరణి, రీతు లకు రెండు నామినేషన్స్ ఛాన్స్ ఇచ్చిన తనూజ కళ్యాణ్, సంజన, సుమన్ శెట్టి, దివ్య లకు మాత్రం ఒక్క నామినేషన్ ఛాన్స్ ఇచ్చింది. ఇక రీతు దివ్య, సంజనని నామినేట్ చేసింది. కళ్యాణ్ తనకున్న ఒక నామినేషన్ సంజనాకి వేస్తే.. ఆమె కూడా కళ్యాణ్ కే వేసింది.

ఐతే కళ్యాణ్ ని నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి ఫైర్ అయ్యాడు. లాస్ట్ వీక్ టాస్క్ లో బిల్డింగ్ బాక్స్ లో సంజన, సుమన్ ఇద్దరు కూడా ఆరు బాక్స్ లు పెట్టారు. కానీ సంజనా బాక్స్ లు కరెక్ట్ గా ఉన్నాయని సంచాలక్ గా ఉన్న కళ్యాణ్ సంజానాని గెలిపించాడు. ఐతే ఈ టాస్క్ లో కళ్యాణ్ డెసిషన్ మీద సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. ఐతే కళ్యాణ్ నువ్వు అంటూ వేలి పెట్టి చూపించడంతో సుమన్ రెచ్చిపోయాడు. ఒకవేళు నువ్వు నన్ను చూపిస్తే నాలుగు వేళ్లు నిన్ను చూపిస్తాయని అన్నాడు. అంతేకాదు వేలు దించు అంటే కళ్యాణ్ నేను నీకు వేలు చూపించట్లేదని అన్నాడు.

తన వల్ల అయినంత ఎఫర్ట్ పెడుతున్న సుమన్ శెట్టి..

అలా సుమన్ శెట్టి కళ్యాణ్ మధ్య నామినేషన్స్ ప్రక్రియ హీటు పెంచింది. ఐతే అదే ఫోర్స్ తో సుమన్ శెట్టి కళ్యాణ్ ముందు ఉన్న దిష్టి బొమ్మపై కుండని గట్టిగా పగలగొట్టాడు. కళ్యాణ్ అంత గట్టిగా అవసరం లేదని అన్నాడు. మొత్తానికి సుమన్ శెట్టిలో ఈ ఫైర్ అసలు ఊహించలేదు. తనకి అన్యాయం జరిగింది అది కూడా కళ్యాణ్ వల్ల జరిగిందని సుమన్ అలా రెచ్చిపోయాడు. ఐతే ఈ వారం సుమన్ శెట్టి నామినేషన్స్ లో కూడా లేడు కాబట్టి ఆట మీద మరింత గ్రిప్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది.

బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి ముందు వారాలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ తన మంచితనంతో ఆడియన్స్ మనసులు గెలిచాడు. టాస్క్ లల్లో కూడా తన వల్ల అయినంత ఎఫర్ట్ పెడుతున్నాడు. సో సుమన్ శెట్టి టాప్ 5కి వెళ్తాడా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తప్పకుండా ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం అతను కూడా ఫైనల్ వీక్ లో ఉండే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News