ఆశా మేరీపై ఎన్నో ఆశలు!
కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల కంటే కూడా ఇంకొందరు చేసే పాత్రలే సినిమాపై ఆసక్తిని పెంచుతాయి.;
కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల కంటే కూడా ఇంకొందరు చేసే పాత్రలే సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ఇప్పుడలాంటి సిట్యుయేషన్సే ఏర్పడ్డాయి. ప్రియదర్శి, ఆనంది ప్రధాన పాత్రల్లో వస్తోన్న ప్రేమంటే సినిమాలో నటి, యాంకర్ సుమ కీలక పాత్రలో కనిపించనున్నారు. కామెడీ ప్రధానంగా వస్తోన్న ఈ మూవీలో సుమ క్యారెక్టర్ నవ్వుల్ని పూయించడమే కాకుండా ఆడియన్స్ ను అలరించడం ఖాయమనే అనిపిస్తోంది.
ఎంతమంది వచ్చినా ఆమె ప్లేస్ మారలేదు
తెలుగు ఆడియన్స్ అందరికీ సుమ పరిచయస్తురాలే. కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు సుమ. ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ, సుమ స్థానం మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ పెద్ద సినిమాల ఈవెంట్ అంటే దానికి హోస్ట్ గా సుమ నే ఉంటారు. తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఎంతో హుందాగా ఈవెంట్స్ ను హోస్ట్ చేస్తుంటారు సుమ.
జయమ్మ పంచాయితీలో ఆఖరిగా కనిపించిన సుమ
అలాంటి సుమ ఆఖరిగా జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించారు ఆ సినిమా ఆడకపోయినా, సుమ తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో ఎంతో నేచురల్ ఎమోషన్స్ తో సుమ నటించిన తీరు, దానికి కామెడీని జోడించిన విధానం అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు సుమ, నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయమవుతూ వస్తోన్న ప్రేమంటే అనే రొమాంటిక్ థ్రిల్లర్ లో కీలక పాత్రలో కనిపించనున్నారు.
పోలీస్ పాత్రలో సుమ
మొదటి నుంచే ఈ సినిమాకు మంచి బజ్ ఉంది. సినిమా ముహూర్తానికి రానా క్లాప్ కొట్టడం, సందీప్ రెడ్డి వంగా కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో పూజా కార్యక్రమాల నుంచే ప్రేమంటే అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఈ సినిమాలో సుమ ఆశా మేరీ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుమ పోలీస్ యూనీఫాంలో అందరి దృష్టినీ ఆకర్షించారు.
సినిమాలో హైలైట్ గా సుమ సీన్స్
అయితే ఈ సినిమాలో సుమ క్యారెక్టర్ పోలీస్ అయినప్పటికీ ఆమె తన వృత్తి రీత్యా పెద్దగా స్ట్రిక్ట్ ఆఫీసరేమీ కాదు. పోలీసు క్యారెక్టర్ లో కూడా సుమ కామెడీ చేస్తూ కనిపించనున్నారని ఆల్రెడీ రిలీజైన కంటెంట్ చూస్తుంటే క్లారిటీ వస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుమ ఎలాంటి కామెడీ చేసి అలరించనున్నారో అని చూడ్డానికి ఆడియన్స్ ఎంతో ఎగ్జైంటిగ్ గా ఉన్నారు. సినిమాలో ప్రియదర్శి, ఆనంది లీడ్ రోల్స్ చేసినప్పటికీ ప్రేమంటే లో సుమ నటించిన కొన్ని సీన్స్ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలిచాయని, ఆమె పాత్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చిత్ర మేకర్స్. మరి ఆశా మేరీ ఆడియన్స్ ను ఏ మేర అలరించి, ఆకట్టుకుంటుందో చూడాలి.