"సుకుమార్ - తబిత"ల 17 ఏళ్ల బంధం: హృదయాన్ని హత్తుకునే పెళ్లిరోజు పోస్ట్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఆయన భార్య తబిత బండ్రెడ్డి రేపటి తో తమ వివాహ బంధంలో 17 వసంతాలను పూర్తి చేసుకోనున్నారు.

Update: 2026-06-12 05:42 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఆయన భార్య తబిత బండ్రెడ్డి రేపటి తో తమ వివాహ బంధంలో 17 వసంతాలను పూర్తి చేసుకోనున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా తబితా సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలవడం కాదు, ఇద్దరు వేర్వేరు మనషులు కలిసి ఒకే జీవితాన్ని పంచుకోవడం అంటూ ఆమె రాసుకొచ్చిన మాటలు అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.

ఆర్య సెట్స్‌లో మొదలైన ప్రేమ కథ:

సుకుమార్, తబితల పరిచయం ఈనాటిది కాదు. సుకుమార్ కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఆర్య' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట, ఇరువైపులా పెద్దలను ఒప్పించి 2009 జూన్ 13న ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.

17 ఏళ్ల అందమైన ప్రయాణం:

"పెళ్లయిన కొత్తలో నాకు పెళ్లి వెనుక ఉన్న అసలు అర్థం తెలీదు. కానీ కలిసి జీవిస్తున్న కొద్దీ ఈ బంధం ఎంత అందమైనదో అర్థమైంది" అంటూ తబితా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వేర్వేరు అలవాట్లు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సర్దుకుపోతూ కలిసి ఎదగడమే జీవితం అని ఆమె చెప్పారు. గత 17 ఏళ్లుగా ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు, సుకుమార్ లాంటి భర్త దొరికినందుకు దేవుడికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేస్తారు.

కేవలం భార్యగానే కాదు.. బిజినెస్ ఉమెన్‌గానూ:

తబిత కేవలం సుకుమార్ భార్యగానే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గానూ రాణిస్తున్నారు. 'లాండ్రీకార్ట్' అనే వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతూనే, ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. సుకుమార్ కథ అందించిన సూపర్ హిట్ సినిమా 'కుమారి 21ఎఫ్' సీక్వెల్‌గా వస్తున్న 'కుమారి 22ఎఫ్' చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలను ఆమె స్వయంగా నిర్మిస్తున్నారు.

హ్యాపీ ఫ్యామిలీ.. క్రేజీ ప్రాజెక్ట్స్:

సుకుమార్, తబితల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సుకృతి, కొడుకు సుక్రాంత్‌లతో వీరి కుటుంబం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇక కెరీర్ పరంగా చూస్తే, లెక్కల మాస్టారు సుకుమార్ 'పుష్ప' సిరీస్‌తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక నేషనల్ వైడ్‌గా దర్శకుడిగా ఆయన బిజీగా ఉన్నప్పటికీ, ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు.

సుకుమార్ విజయాల వెనుక తబితా సపోర్ట్ ఎంతో ఉంది. అందుకే ఈ క్రేజీ జోడీ 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ స్టార్ కపుల్ ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో హ్యాపీగా జరుపుకోవాలని మనమూ కోరుకుందాం.




Tags:    

Similar News