ఆర్సీ 17 సుకుమార్ మేథస్సుకు పరీక్షేనా?
తాజాగా చరణ్‌తో తెరకెక్కిస్తోన్న `పెద్ది`తో ఆయన ఏ స్థాయికి చేరుకుంటారో అన్నది ఆసక్తికరం. శిష్యుడు వేసిన అడుగులు గురువుకు గర్వకారణమే అయినా.;
దర్శక సంచలనం సుకుమార్‌కు ఇప్పుడు ఓ ఆసక్తికర పరిస్థితి ఎదురవుతోంది.తన శిష్యుడు బుచ్చిబాబు సానా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తోన్న `పెద్ది` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. బుచ్చిబాబు తన గురువును మించి `పెద్ది`తో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే? అది సుకుమార్‌కు ఓ రకమైన స్వీట్ ఛాలెంజ్ గా మారుతుంది. రామ్ చరణ్ 17వ చిత్రాన్ని సుకుమారే తెరకెక్కించాల్సి ఉండటంతో శిష్యుడి విజయాన్ని మించిన అవుట్‌పుట్ ఇవ్వాల్సిన బాధ్యత గురువుపై ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ హీరో మాత్రమే కాదు.`ఆర్ ఆర్ ఆర్` సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న అంతర్జాతీయ నటుడు. చరణ్ రేంజ్‌కు తగ్గట్లుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను మెప్పించేలా ఓ అద్భుతాన్ని సృష్టించడం సుకుమార్ ముందున్న అతిపెద్ద సవాలు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్అ యిన `రంగస్థలం` ఓ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. RC 17 ఆ మైలురాయిని దాటి సరికొత్త రికార్డులను సృష్టించాల్సి ఉంది. చరణ్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించే బాధ్యత సుకుమార్ భుజస్కం ధాలపై ఉంది. అలాగే సుకుమార్ గత చిత్రమైన `పుష్ప` ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో ఒక ట్రెండ్ సెట్ చేశారు. `పుష్ప` సృష్టించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాతో ఆ ప్రభంజనాన్ని మించిపోవాలి. కేవలం ఇతర దర్శకులతోనే కాకుండా, తనను తాను కూడా అధిగమించాల్సిన పరిస్థితి సుకుమార్‌కు ఏర్పడింది. `పుష్ప కంటే భిన్నమైన అంతకంటే పవర్‌ఫుల్ కథాంశంతో చరణ్‌ను ప్రజెంట్ చేయడం సుకుమార్ మేధస్సుకు ఒక పరీక్ష లాంటిదే అని చెప్పాలి.
సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు సానా ఇప్పటికే `ఉప్పెన`తో సత్తా చాటారు. తాజాగా చరణ్‌తో తెరకెక్కిస్తోన్న `పెద్ది`తో ఆయన ఏ స్థాయికి చేరుకుంటారో అన్నది ఆసక్తికరం. శిష్యుడు వేసిన అడుగులు గురువుకు గర్వకారణమే అయినా. బాక్సాఫీస్ సమీకరణాల దృష్ట్యా సుకుమార్ తన పనితనంతో మరోసారి మాస్టర్ అనిపించుకోవాలి. శిష్యుడి సినిమా ఇచ్చే కాంపిటీషన్ సుకుమార్‌ను మరింత క్రియేటివ్‌గా ఆలోచించేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ గురు-శిష్యుల పోటీ టాలీవుడ్‌కు మేలు చేసేదే.
చరణ్ గ్లోబల్ ఇమేజ్ దృష్ట్యా ఆర్సీ17 ప్రాంతీయ చిత్రంగా మిగిలిపోకూడదు. సుకుమార్ తనదైన మార్కు ఎమోషన్స్ , రా అండ్ రస్టిక్ మేకింగ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకునే సుకుమార్? ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. తన శిష్యుడి విజయాన్ని గౌరవిస్తూనే, ఒక గురువుగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాల్సిన అవసరం సుకుమార్‌పై ఉంది.
ఆర్సీ 17 అనేది సుకుమార్ కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన - ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కాబోతోంది. అటు శిష్యుడి గెలుపును అధిగమించాలి. ఇటు తన సొంత రికార్డులను తిరగరాయాలి. అన్నింటికీ మించి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌డమ్‌కు న్యాయం చేయాలి. ఈ మూడు సవాళ్లను సుకుమార్ ఎలా అధిగమిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వచ్చే సినిమా టాలీవుడ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.