లెక్కల మాస్టర్ కి మిగతా దర్శకులకు ఉన్న తేడా ఇదే...
క్రియేటివ్ గా సినిమాలు చేసిన దర్శకులకే సక్సెస్ లు వరిస్తాయి. ఒక మూవీ సక్సెస్ 10 అవకాశాలను ఆహ్వానిస్తుంది. ఒక సినిమా ఫ్లాప్ పాతాళానికి పడేస్తుంది
క్రియేటివ్ గా సినిమాలు చేసిన దర్శకులకే సక్సెస్ లు వరిస్తాయి. ఒక మూవీ సక్సెస్ 10 అవకాశాలను ఆహ్వానిస్తుంది. ఒక సినిమా ఫ్లాప్ పాతాళానికి పడేస్తుంది. అందుకే చాలామంది సక్సెస్ఫుల్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు సక్సెస్ లను వాళ్ల వెనకాల తిప్పుకుంటున్నారు. అందులో సుకుమార్ ఒకరు. ఆయన చేసిన సినిమాలు అతన్ని గొప్ప దర్శకుడిగా నిలబెట్టాయి. ఈ మధ్య కాలంలో తనతో పాటు తన శిష్యులు కూడా ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. 'రంగస్థలం' సినిమాకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేసిన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల దర్శకులుగా మారి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు... వీళ్ళతో పాటు 'వీరూపాక్ష' తో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న 'కార్తీక్ దండు' సైతం సుకుమార్ శిష్యుడే... ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు...
సుకుమార్ ఆ విషయంలో క్లారిటీ గా ఉంటాడు...
సుకుమార్ తన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి క్రాఫ్ట్ లకు సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వర్క్ ను అప్పజెప్తూ ఎవరెలా చేస్తున్నారో తెలుసుకుంటాడట. దానివల్ల అందరు వర్క్ నేర్చుకుంటారు. అలాగే సినిమా ఎలా చేయాలి? ఎలా చేయకూడదు అనే విషయాలను సైతం వాళ్ళకి చెబుతుంటాడట. అందుకే సుకుమార్ దగ్గర వర్క్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. తన దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్న వాళ్లందరికి క్రెడిట్ ఇస్తాడు. కొంతమంది దర్శకులు తమ టీమ్ గురించి చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ సుకుమార్ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. ఎవరికి ఏ పని చెప్పాడో ఆ పనిని ఎవరైతే సక్సెస్ ఫుల్ గా చేశారో వాళ్ల గురించి స్టేజ్ మీద మాట్లాడుతుంటాడు. ఇలా చెప్పడం వల్ల తమ వర్క్ ను అందరికీ పరిచయం చేసిన వాడవుతాడు.
దీనివల్ల వాళ్లకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. తద్వారా వాళ్ళతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తారు. కొంతమంది దర్శకులు దీనికి పూర్తి భిన్నంగా ఉంటారు. అలాగే తన సినిమా కోసం వాళ్ల అసిస్టెంట్స్ ఇచ్చిన ఇన్ పుట్స్ ఏంటనేది కూడా పెద్దగా ప్రస్తావించరు. డైరెక్టర్స్ అవ్వడానికి వాళ్ల అసిస్టెంట్స్ కి ఎలాంటి హెల్ప్ చేయరు. కానీ సుకుమార్ మాత్రం తన శిష్యులు చెప్పిన కథ నచ్చితే తనే ప్రొడ్యూసర్ గా మారి వాళ్లను డైరెక్టర్లుగా పరిచయం చేస్తున్నాడు...
తన సినిమాల విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో తన అసిస్టెంట్స్ చేసే సినిమాల విషయంలో కూడా సుకుమార్ అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. తనకు అనిపించిన విషయాన్ని చెబుతాడు. ఏదైనా క్లారిటీ లేకపోతే దాని మీద చర్చిస్తూ ఉంటాడు. స్క్రిప్ట్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ చేస్తూ వాళ్ళందరిని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా నిలుపడంలో సుకుమార్ కీలక పాత్ర వహిస్తున్నాడు...మిగతా దర్శకులతో పోలిస్తే సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీ లో ఎక్కువ మంది సక్సెస్ అవ్వడానికి ఈ వర్కింగ్ కల్చరే కారణం....