త‌న‌యుల విష‌యంలో ఊహించ‌నిదే జ‌రుగుతోందా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా రాణించిన ఓ నటుడు తన కుటుంబం గురించి.. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2026-10-14 01:30 GMT

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా రాణించిన ఓ నటుడు తన కుటుంబం గురించి.. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లలను ఏ పరిస్థితుల్లోనూ సినిమా పరిశ్రమ వైపు అడుగుపెట్టనివ్వనని.. వారిని పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని కొంత కాలం క్రితం ఆయన మీడియా ముఖంగా అన్నారు. గ్లామర్ ప్రపంచంలోని ఒత్తిళ్లు, అనిశ్చితి పిల్లలకు వద్దని ఆయన బలంగా నమ్దారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! సరిగ్గా ఆయన ఏదీ జరగకూడదని కోరుకున్నారో? ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతుండటం విశేషం.

ఆయన ఎంత వారించినా? కాలం తెచ్చిన మార్పుల వల్ల ఆ హీరో త‌న‌యుడు ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. లవర్ బోయ్ ఇమేజ్‌తో తెరంగేట్రం చేసిన ఆ యువ హీరో, వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ తనదైన శైలిలో అల‌రిస్తున్నాడు. తండ్రి నీడ నుంచి బయటపడి స్వయంకృషితో నిలదొక్కుకోవడానికి ఆ కుమారుడు పడుతున్న తపన చూస్తుంటే? సినిమా రక్తంలోనే ఉందనే సత్యాన్ని ఎవరూ మార్చలేరని మరోసారి నిరూపితమవుతోంది.

అయితే ఇక్కడితో ఆ కథ ఆగలేదు. తాజాగా ఆ నటుడి కుమార్తె కూడా రంగప్రవేశం చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అన్న బాటలోనే చెల్లెలు కూడా కెమెరా ముందుకు వచ్చి మేకప్ వేసుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏమాత్రం ఇండస్ట్రీకి రానిస్తానని అనుకోని తండ్రికి ఇప్పుడు తన ఇద్దరు సంతానం వెండితెరపై ప్రయాణం చేస్తుండటం నిజంగా ఊహించని పరిణామమే. తండ్రి గతంలో ఇచ్చిన అన్న మాటలు  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ అవుతుండగా కాలం ఎవరిని ఎటు వైపు నడిపిస్తుందో? ఎవరూ ఊహించలేరు` అనే మాటకు ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

చిత్ర పరిశ్రమలో వారసత్వం అనేది ఒక వైపు చర్చనీయాంశంగా ఉన్నా? ప్రతిభ ఉన్నవారికే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది నిరాకరించలేని సత్యం. తల్లిదండ్రులు వద్దనుకున్నా? వారిలోని కళాపిపాస, వెండితెరపై ప్రకాశించాలనే తపన చివరికి వారిని ఇండస్ట్రీ వైపే అడుగులు వేయించాయి. గతంలో ఆ సీనియర్ నటుడు చెప్పిన మాటలు కేవలం ఒక తండ్రిగా తన పిల్లల భవిష్యత్తు, భద్రత పట్ల ఉన్న ఆందోళన మాత్రమేనని.. కానీ నేడు వారి ఆసక్తిని గౌరవించి ప్రోత్సహించక తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడా నటుడి ఇంట్లో ఇద్దరు యంగ్ టాలెంట్స్ ఉండటంతో వారి భవిష్యత్తు ప్రయాణం ఎలా సాగుతుందనేది-ఆసక్తికరంగా మారింది. ఓవైపు త‌న‌యుడు మాస్ - లవ్ జోనర్లలో అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. మరోవైపు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కుమార్తే ఎలాంటి పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ఏదేమైనా? తండ్రి వేసిన బలమైన పునాది.. నటనలో ఉన్న అనుభవం వారిద్దరికీ మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News