తెలుగు సినిమా గర్వించేలా `ర‌ణ‌బాలి`.. ప్రీరిలీజ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్‌

బ్రిటిష్ కాలం నాటి నేపథ్యం, గ్రామీణ ప్రజల పోరాటాలు.. విప్లవాత్మక అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తన పాత్ర కోసం విజయ్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకోవడంతో పాటు ఎంతో శ్రమించారు.

Update: 2026-10-13 18:08 GMT

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `రణబాలి` అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఈ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ చిత్రం మాత్రమే కాదని... తెలుగు సినిమా పరిశ్రమ తల ఎత్తుకునేలా సరికొత్త చరిత్ర సృష్టించబోతుందని స్పష్టం చేశారు. విజయం కోసం దర్శకుడు రాహుల్ సంకృత్యన్ పడిన కష్టాన్ని.. ఆయన చేసిన లోతైన రీసెర్చ్‌ను వేదికపై కొనియాడారు.

బ్రిటిష్ కాలం నాటి నేపథ్యం, గ్రామీణ ప్రజల పోరాటాలు.. విప్లవాత్మక అంశాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తన పాత్ర కోసం విజయ్ ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకోవడంతో పాటు ఎంతో శ్రమించారు. ఈ ప్రాజెక్ట్ ప్రతి క్షణం ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని..తెర వెనుక ప్రతి టెక్నీషియన్ పెట్టిన ఎఫర్ట్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుందని విజ‌య్ తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకులు అజయ్-అతుల్ అందించిన మాసివ్ మ్యూజిక్ - బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆయువుపట్టుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక ఈ వేదిక‌పై 150 ఏళ్ల క్రితం ఎల్ నినో వ‌చ్చి క‌రువు దాపురించింద‌ని.. బ్రిటీష‌ర్ల పాల‌న‌లో ఇది సంభ‌వించింద‌ని దేవ‌ర‌కొండ గుర్తు చేస్తూ నేటి ఎల్.నినోతో ముడిపెట్టి మాట్లాడ‌టం అల‌రించింది. ఈ క‌రువును దాటుకుని వెళ్లేప్పుడు మ‌రో ఏడాది పాటు తినే ఆహారం, నీళ్లు, క‌రెంట్ ప్ర‌తిదీ జాగ్ర‌త్త‌గా వాడాల‌ని విజ‌య్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. టాక్సీ వాలా స‌మ‌యంలో చెప్పాను ఐ విల్ బి బ్యాక్ అని .. ఇప్పుడు మ‌ళ్లీ చెబుతున్నాను అంటూ విజ‌య్ అభిమానుల్లో హుషారు నింపారు.

ఈ సినిమాతో అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే విజ‌యం అందుకుంటే సీమ‌లో అదిరిపోయే స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హిస్తామ‌ని కూడా దేవ‌ర‌కొండ వేదిక‌పై హింట్ ఇచ్చారు. అలాగే విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోవడమే తన సమాధానం అని, తన వైఫల్యాలను చూసి ఆనందించే వారికి తదుపరి విజయాలతోనే గట్టి బదులిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు చెమ‌ట‌లు చిందించి ప‌ని చేసార‌ని.. నిజాయితీతో కూడిన కష్టాన్ని ఎవరూ ఎప్పటికీ తక్కువ చేయలేరని పేర్కొన్నారు. మైత్రి బ్యాన‌ర్ లో మూడో సినిమా చేస్తున్నానని.. వారంతా అద్భుత‌మైన వ్య‌క్తులు అని విజ‌య్ అన్నారు. కెమెరా వ‌ర్క్, సంగీత ద‌ర్శ‌కులు స‌హా ఇత‌ర టెక్నీషియ‌న్ల‌పైనా ప్ర‌శంస‌లు కురిపించారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత రిచ్ ప్రడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించిందని విజయ్ ప్రశంసించారు. రష్మిక మందన్నతో సహా నటవర్గమంతా తమ పాత్రలకు పూర్తిన్యాయం చేశారని...ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఒక ఎమోషనల్ ప్రయాణమని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లలో ఇప్పటివరకు చూడని ఒక విజువల్ వండర్‌ను ఈ చిత్రం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అభిమానుల అపారమైన ప్రేమాభిమానాలే తనకు ఎప్పుడూ అతిపెద్ద బలమని... వారిని నిరాశపరచకుండా ఉండేందుకే తాను నిరంతరం కష్టపడుతుంటానని విజయ్ భావోద్వేగంతో చెప్పారు. కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి ఈ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 16న విడుదలవుతున్న `రణబాలి` సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఘనవిజయం చేయాలని ఆయన కోరారు.







Tags:    

Similar News