జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా.. సాయిప‌ల్ల‌వి ర‌హ‌స్యాలు బ‌ట్ట‌బ‌య‌లు!

వెండితెరపై తన సహజసిద్ధమైన అభినయంతో... కట్టుబొట్టుతో యావత్ సినీ ప్రియులను ఆకట్టుకున్న నటి సాయి పల్లవి త్వరలోనే మరో సరికొత్త రూపంలో వీక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2026-10-13 16:52 GMT

వెండితెరపై తన సహజసిద్ధమైన అభినయంతో... కట్టుబొట్టుతో యావత్ సినీ ప్రియులను ఆకట్టుకున్న నటి సాయి పల్లవి త్వరలోనే మరో సరికొత్త రూపంలో వీక్షకుల ముందుకు రాబోతున్నారు. జీ తెలుగులో ఎంతో ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ టాక్ షో `జయ‌మ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి` రెండవ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు తొలి విశిష్ట అతిథిగా సాయి పల్లవి విచ్చేసి... తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం.. అనుభవాలను హోస్ట్ జగపతి బాబుతో ముచ్చటించారు.

ప్రసిద్ధ నటుడు జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో.. కేవలం సినిమాల ప్రమోషన్లకే పరిమితం కాకుండా సెలబ్రిటీల నిజమైన వ్యక్తిత్వాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. మొదటి సీజన్‌లో అక్కినేని నాగార్జున, శ్రీలీల వంటి అగ్ర నటీనటులు పాల్గొని తమ కెరీర్ మైలురాళ్లను, వ్యక్తిగత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. అదే బాటలో సీజన్ 2 కూడా అంతకంటే వినోదాత్మకంగా.. ఆత్మీయమైన సంభాషణలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న మైథలాజికల్ చిత్రం `రామాయణం`లో `సీత`పాత్రను పోషిస్తున్న సాయి పల్లవిని అభిమానులు ``మా సీత`` అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ తర్వాత సాయిప‌ల్ల‌వి ఇస్తున్న తొలి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇదే కావడంతో ఈ ఎపిసోడ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెరపై ఈ అభిన‌య‌నేత్రి చూపించే సహజత్వంతో పాటు.. తెర వెనుక ఆమెకున్న సాధారణ జీవన విధానాన్ని ఈ షో ద్వారా వీక్షకులు తిలకించవచ్చు.

ఈ గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో జగపతి బాబు- సాయి పల్లవి మధ్య సాగిన సంభాషణలు ఎంతో ఆహ్లాదకరం..వినోదాత్మ‌కం. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని పలు ఆసక్తికర విషయాలను, జ్ఞాపకాలను సాయి పల్లవి ఈ వేదికపై షేర్ చేసారు. సాంప్రదాయ ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు భిన్నంగా.. స్వచ్ఛమైన సరదా సంభాషణలతో కూడిన ఈ టాక్ షో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న `జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి` సీజన్ 2 అక్టోబర్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే టెలివిజన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కానుంది. సాయి పల్లవి అన్-ఫిల్టర్డ్ మాటలతో షురూ కానున్న ఈ సీజన్ టాలీవుడ్ బుల్లితెర వీక్షకులను గొప్ప‌గా అలరించడానికి సిద్ధమైంది.



Tags:    

Similar News